Pahalgam Terror Attack: ఉగ్రవాదుల వివరాలందిస్తే.. భారీ నజరానా
ABN, Publish Date - Apr 25 , 2025 | 01:57 PM
Pahalgam Terror Attack: ఉగ్రదాడికి దిగిన ఉగ్రవాదులు ఆచూకీ చెబితే భారీ నజరానా ఇస్తామని జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. ఈ దాడిలో నలుగురు పాల్గొన్నారన్నారు. వాారిలో ఇద్దరు పాకిస్థానీయలని, మరో ఇద్దరు స్థానికులని వివరించారు.
శ్రీనగర్, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి కారణంగా 26 మంది మృతికి కారణమైన ఉగ్రవాదుల వివరాలందిస్తే.. భారీ నజరానా అందిస్తామని ఆ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వారి వివరాలు ఇచ్చిన వారికి రూ. 20 లక్షలు ఇస్తామని తెలిపారు. శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లో విలేకర్ల సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఈ ఉగ్ర దాడికి పాల్పడిన వారి ఊహా చిత్రాలతోపాటు వారి వివరాలను వివరించారు.
ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారన్నారు. ఈ దాడిలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న బాధితులు.. ఈ ఉగ్రవాదుల గురించి వివరించారని చెప్పారు. అయితే వీరిలో ఇద్దరు చొరబాటుదారులని, మరో ఇద్దరు స్థానికులని పేర్కొన్నారు. అలీ బాయ్ అలియాస్ తల్హ, అసీఫ్ ఫౌజీ వీరిద్దరు పాకిస్థాన్ వాసులని వెల్లడించారు. అదిల్ హుసైన్ తొకర్. ఇతడు అనంతనాగ్ వాసి అని.. మరొకరు అహ్షన్ పుల్వామా వాసి అని తెలిపారు.
ఇంతకీ హషీం మూసా ఎవరు?
ఈ దాడిలో కీలక ప్రధాన నిందితుల్లో ఒకరైన పాకిస్తానీ హషీమ్ మూసా అలియాస్ సులేమాన్ గత ఏడాదిగా జమ్మూ కాశ్మీర్‌లో నివసిస్తున్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. అతడు తీవ్రవాద చర్యల్లో చురుగ్గా పని చేస్తున్నాడని చెప్పారు. భద్రతా దళాలపైనే కాకుండా.. స్థానికేతరులపై కూడా అతడు పలుమార్లు దాడులకు తెగబడ్డాడని వివరించారు.
లష్కరే తోయిబాతో కాకుండా.. లోయలో పాకిస్థాన్‌కు మద్దతుగా ఇతర ఉగ్రవాద మూకలతో ముసా పని చేస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. మరోవైపు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ముసా గురించి స్థానిక ప్రజలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ దాడికి పాల్పడిన వారి కోసం వేలాది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక సూచన
Pahalgam Terror Attack: దేశం వీడుతోన్న పాకిస్థానీయులు..
Pahalgam terror attack: ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మృతి చెందిన లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. నిందితుడు అరెస్ట్
For National News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 01:57 PM