Pahalgam Terror Attack: ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక సూచన
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:17 PM
pahalgam terror attack: పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటి వేళ.. భారత్ కీలక నిర్ణయాలు తీసుకొంటే.. పాకిస్థాన్ సైతం అదే బాటలో పయనిస్తుంది. అలాంటి వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆంక్షలు విధించడంతో.. పాకిస్థాన్ సైతం అదే బాటలో పయనించింది. అందులోభాగంగా తమ దేశ గగన తలంలో భారత్ విమానాలు విహరించ రాదంటూ పాక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్ శుక్రవారం స్పందించాయి.
ఎయిర్ ఇండియా..
పాకిస్థాన్ తాజాగా షరతులు విధించిన కారణంగా.. ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్, మధ్య ప్రాచ్య దేశాల నుంచి భారత్ చేరుకోవల్సిన విమానాలు మరింత ఆలస్యమవుతోందని తెలిపింది. ఆ యా ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలు మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వస్తుండడం వల్ల ఈ ఆలస్యానికి కారణమవుతోందని పేర్కొంది. ఈ కారణంగా.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. అలాగే సిబ్బందితోపాటు ప్రయాణికుల భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా పునర్ఘాటించింది.
ఇక ఇండిగో..
ఇండిగో విమానయాన సంస్థ సైతం దాదాపుగా ఇదే రీతిలో స్పందించింది. పాక్ తీసుకున్న నిర్ణయంతో పలు అంతర్జాతీయ విమానాలపై ఈ ప్రభావం పడుతోందని వివరించింది. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నామంది. అయితే ఈ అసౌకర్యాన్ని క్రమంగా తగ్గించేందుకు తాము పని చేస్తామని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.
పెరిగిన విమాన ఛార్జీలు..!
మరోవైపు భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాలు పాక్ గగన తలం నుంచి కాకుండా పలు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడం వల్ల ప్రయాణ సమయం అధికమవుతోంది. దాంతో విమాన ఛార్జీలు సైతం విమానయాన సంస్థలు అధికంగా వసూల్ చేస్తున్నట్లు ఓ ప్రచారం అయితే సాగుతోంది.
భారత్ నిర్ణయం..
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాక్‌తో ఉన్న సంబంధాలను భారత్ దాదాపుగా తెంచుకొంది. ఆ క్రమంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌లోని దౌత్య వేత్తను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ తరహా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకొంది.
ప్రతిగా పాక్..
అలాంటి వేళ.. పాక్ సైతం అదే రీతిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అదే విధంగా భారతీయ విమానాలు తమ గగన తలంపై విహరించకూడదంటూ పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లే పలు అంతర్జాతీయ విమానాలు మరో మార్గం ద్వాారా గమ్యస్థానాలకు చేరుకొంటున్నాయి. దీంతో అధిక సమయంతోపాటు అధికంగా ఇంధనం ఖర్చవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: దేశం వీడుతోన్న పాకిస్థానీయులు..
Pahalgam terror attack: ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మృతి చెందిన లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. నిందితుడు అరెస్ట్
For National News And Telugu News