ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Pakistan Conflict: చైనా సరుకు ఫెయిల్‌

ABN, Publish Date - May 08 , 2025 | 04:58 AM

భారత్‌ చేసిన మెరుపు దాడిని పాకిస్థాన్‌ అడ్డుకోలేకపోయింది, ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. భారత క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనేందుకు పాక్‌ అసమర్ధమై పోయింది.

భారత్‌ దాడిని అడ్డుకోలేని పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌

చైనా నుంచి కొన్నవే అత్యధికం

సాంకేతిక సమస్యలు, నైపుణ్య లేమి

భారత్‌ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ చెబుతూ వచ్చింది. సరిహద్దులో తమ సైనిక దళాలు, విమాన/క్షిపణి విధ్వంసక వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ప్రకటించుకుంది. కానీ మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత్‌ ఒకేసారి తొమ్మిది లక్ష్యాలపై కేవలం 25 నిముషాల వ్యవధిలో దాడి చేసినా పాక్‌ పసిగట్టలేకపోయింది. భారత క్షిపణుల్ని, డ్రోన్లను అడ్డుకుని కూల్చివేయలేకపోయింది. పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థల్లో అత్యధికం చైనా నుంచి కొనుగోలు చేసినవే కావడం, వాటి నిర్వహణలో అనేక సమస్యలుండడం పాక్‌కు శాపంగా మారుతోంది. 2011లో అమెరికా దళాలు అర్ధరాత్రి పాక్‌లోకి చొరబడి అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టాయి. ఆ ఆపరేషన్‌ కోసం అమెరికా రెండు బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు, ఒక చినూక్‌ హెలికాప్టర్‌, అనేక నిఘా డ్రోన్లను ఉపయోగించింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు వాటిని అడ్డుకోలేకపోయాయి. 2019లో భారత మిరాజ్‌ యుద్ధ విమానాలు పాక్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి అక్కడి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. అప్పుడూ పాక్‌ కనిపెట్టి అడ్డుకోలేకపోయింది. తాపీగా మర్నాడు ప్రతీకార దాడికి మాత్రం దిగింది. 2022 మార్చిలో భారత్‌కు చెందిన ఒక బ్రహ్మోస్‌ క్షిపణి సాంకేతిక తప్పిదం కారణంగా పాక్‌లోకి ప్రవేశించి పాక్‌ గగనతలంలో 110 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. అయినా పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌కు ఎంతమాత్రం తెలియలేదు. తాజాగా 2024 జనవరిలో ఇరాన్‌ పాక్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో గల ఉగ్రవాద ఽశిబిరాలపై క్షిపణి, డ్రోన్‌ దాడులు చేసింది. వాటిని కూడా అడ్డుకోలేక పాక్‌ తెల్లమొహం వేసింది. ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత క్షిపణులు, డ్రోన్లు తమ భూభాగంలోకి, పీవోకేలోకి ప్రవేశించినా పాక్‌ కనిపెట్టలేకపోయింది.


పాక్‌ భారత సరిహద్దు వెంబడి, ఎల్‌వోసీ వెంబడి ప్రధానంగా నాలుగు రకాల ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను మోహరించింది.

హెచ్‌క్యూ 9: చైనా తయారీ లాంగ్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణి వ్యవస్థ. ఇది వంద కిలోమీటర్ల పరిధిలో విమానాలు, క్షిపణుల్ని అడ్డుకోవడానికి ఉద్దేశించినది.

ఎల్‌వై 80: తక్కువ ఎత్తులో విమానాల్ని, క్షిపణు ల్ని అడ్డుకోగల 40 కిలోమీటర్ల రేంజి వ్యవస్థ.

టీపీఎస్‌ 77 అండ్‌ వైఎల్‌సీ -18ఏ రాడార్లు: ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్‌ చేస్తూ ఎక్కువ దూరంలో శత్రు విమానాల్ని, క్షిపణుల్ని గుర్తించగల వ్యవస్థ

అవాక్స్‌ విమానాలు: ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ అనే ఈ వ్యవస్థల్ని విమానాల్లో అమర్చుతారు. ఈ విమానాలు గాలిలోకి ఎగిరినప్పుడు వాటిలోని రాడార్లు శత్రు విమానాల్ని, క్షిపణుల్ని చాలా దూరం నుంచే పసిగడతాయి. చైనా నుంచి కొన్న జెడ్‌డీకే-03, స్వీడన్‌ నుంచి కొన్న సాబ్‌ 2000 ఏరీఐ విమానాల్ని భారత సరిహద్దులో పాక్‌ సిద్ధంగా ఉంచుతుంది.


కానీ ఆపరేషన్‌ సిందూర్‌ను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. ప్రధానంగా చైనా నుంచి కొనుగోలు చేసిన వ్యవస్థల్లో తరచు సాంకేతిక సమస్యలు వస్తుంటాయి. వాటిని సరిచేసే పరిజ్ఞానం పాక్‌ సైనిక సిబ్బందికి సరిగా లేకపోవడం, అన్నింటికీ చైనాపై ఆధారపడడం వల్ల తరచు ఎయిర్‌ డిఫెన్స్‌లో గ్యాప్స్‌ ఏర్పడుతుంటాయి. పాక్‌కు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు పెరగడం వల్ల వీటి మెయింటెనెన్స్‌ కూడా సరిగా లేదని సమాచారం. పైగా ఎయిర్‌ డిఫెన్స్‌ అనేది అందరూ సమన్వయంతో చేయాల్సిన పని. పాక్‌లో వివిధ విభాగాల మధ్య సమన్వయం సరిగా లేదు. చైనా నుంచి కొనుగోలు చేసిన చాలా వ్యవస్థలపై పాక్‌ సైనికుల్లో సరైన అవగాహన కూడా లేదు. వెరసి తమ గగనతలాన్ని కాపాడుకోవడంలో పాక్‌ తరచు విఫలమవుతోంది.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:58 AM