Tyre Puncture Scam: టైర్ పంక్చర్ స్కామ్.. రూ.8 వేలు నష్టపోయిన వ్యక్తి, ఎలాగో తెలుసా..
ABN, Publish Date - Aug 08 , 2025 | 09:50 AM
ఇటీవల కాలంలో స్కామ్‌లు ఎక్కువవుతున్నాయి. మిల్క్ నుంచి మొదలుకుని లిక్కర్ వరకు అనేక రకాల స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టైర్ పంక్చర్ స్కామ్ కూడా వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా ఎప్పుడైనా బైక్ పంక్చర్ జరిగితే మామూలుగా రూ.100 నుంచి రూ.200 ఖర్చవుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం పంక్చర్ కారణంగా ఏకంగా రూ.8,000 నష్టపోయాడు. అదేంటీ అంత రేటా అంటే. అది పంక్చర్ స్కామ్ (Tyre Puncture Scam) అని తేలింది. అసలు ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం పదండి. ఒకరోజు గురుగ్రాంలో ప్రణయ్ కపూర్ అనే వ్యక్తి తన కారు డ్రైవ్ చేస్తుండగా డాష్‌బోర్డ్‌పై టైర్ ప్రెజర్ వార్నింగ్ లైట్ వెలిగింది. వెంటనే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్‌కు వెళ్లి టైర్ చెక్ చేయించేందుకు ఇచ్చాడు.
పంక్చర్ అయ్యిందని..
అక్కడ ఉన్న టైర్ షాప్ అతను దాన్ని చూసి, సార్ పంక్చర్ అయ్యిందని, టైర్ తీసి చెక్ చేయాలన్నాడు. టైర్‌ను జాక్ మీద ఎత్తి, ఓ స్ప్రే బాటిల్‌తో సోపు నీళ్లు చల్లి బ్రష్‌తో రుద్ది ఒక స్క్రూ బయటకి తీసి చూపించాడు. ఆ తర్వాత మీ టైరుకు నాలుగు పంక్చర్లు అయ్యాయని వెల్లడించాడు. ఒక్కో పంక్చర్‌కు మష్రూమ్ ప్యాచ్ వేయాలి. ఒక్కో దానికి రూ.300, మొత్తం రూ.1,200 అవుతుందన్నాడు.
రిపేర్ చేయించకుండా
ప్రణయ్‌కి ఎక్కడో అనుమానం వచ్చింది. వెంటనే అక్కడ రిపేర్ చేయించకుండా, ఓ ప్రొఫెషనల్ టైర్ షాప్‌కి తీసుకెళ్లాడు. అక్కడ టెక్నిషియన్ చెక్ చేసి ఒక్క పంక్చర్ మాత్రమే ఉందని చెప్పాడు. మిగతా మూడు కూడా ఎక్కడో చెక్కినట్టున్నాయని వెల్లడించాడు. అవన్నీ కూడా ఓ టూల్ ద్వారా పంక్చర్ చేసినట్లుగా ఉన్నాయన్నాడు. ఆ క్రమంలో ఓ చిన్న టూల్ చూపించాడు. అదే వాళ్లు స్కామ్ చేసే సమయంలో ఉపయోగించే టూల్ అని పేర్కొన్నాడు. టైర్ చెక్ చేస్తున్నట్టుగా నటిస్తూ, ఆ టూల్‌తో కొత్త పంక్చర్లు చేస్తారని వెల్లడించాడు.
తెలుసుకున్న తర్వాత..
అప్పటికే టైర్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో కొత్త టైర్ వేసుకోవాల్సి వచ్చిందని ప్రణయ్ చెప్పాడు. అందుకోసం రూ. 8,000 వేలు ఖర్చు అయ్యిందని దీని గురించి ప్రణయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ స్కాం గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. పెట్రోల్ పంప్ టైర్ షాప్‌లలో పంక్చర్ రిపేర్ చేయించే ముందు, సిబ్బంది చేతిలో ఏం ఉందో చెక్ చేయాలన్నారు. లేదంటే నేరుగా ప్రొఫెషనల్ టైర్ షాప్‌కి తీసువెళ్లడం మంచిదని సూచించాడు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 10:29 AM