Turkey: పాక్‌తోనే అంటకాగుతాం.. తుర్కియే అధ్యక్షుడు నిస్సిగ్గు ప్రకటన
ABN, Publish Date - May 14 , 2025 | 05:03 PM
ఉగ్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో టర్కీ, అజర్‌బైజాన్‌ను బహిష్కరించాలంటూ భారత్ ప్రజానీకం మండిపడింది. అయినప్పటికీ భారత్‌పై విషం కక్కడంలో పాక్‌తో అంటకాడుతున్న తుర్కియే మరోసారి తన నైజం చాటుకుంది.
న్యూఢిల్లీ: పాక్‌తో ఉద్రికత్తల వేళ భారత్‌కు వ్యతిరేక వైఖరి తీసుకుని దాయాది పాక్‌కు అన్ని విధాలా సహకరించిన తుర్కియే (Turkey) ఆ తర్వాత భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగినా తన వైఖరిలో మార్పు లేదంటూ తాజాగా ప్రకటించింది. పాక్‌కు మద్దతు కొనసాగుతుందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో టర్కీ, అజర్‌బైజాన్‌ను బహిష్కరించాలంటూ భారత్ ప్రజానీకం మండిపడింది. అయినప్పటికీ భారత్‌పై విషం కక్కడంలో పాక్‌తో అంటకాడుతున్న తుర్కియే మరోసారి తన నైజం చాటుకుంది. పాక్ ప్రధాని షెహబాజ్ సరీఫ్ తమ "విలువైన సోదరుడు" అంటూ తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.
Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియాపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించిన ఎన్‌సీడబ్ల్యూ
దీనికి ముందు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఎర్డోగాన్ నాయకత్వం తమకు ఇచ్చిన మద్దతు, సంఘీభావానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సోదర మైత్రిని పెంపొందించిన ఎర్డోగాన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. పాక్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడుల్లా తమను తుర్కియే ఆదుకుంటూ వచ్చిందన్నారు. దక్షిణాసియాలో శాంతిని పెంపొందించేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించిన తుర్కియేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాలు, ప్రజల అభివృద్ధికి మునుముందు కూడా పరస్పర సహకారం కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
విలువైన సోదరుడు
ఇందుకు ఎర్డోగాన్ తాజాగా 'ఎక్స్' వేదికగా స్పందించారు. ''ప్రపంచంలోనే మన రెండు దేశాల మధ్య సంబంధాలు నిజమైన మైత్రికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తాయి. పాకిస్థాన్‌లో శాంతి, సుస్థిరతకు టర్కీ కట్టుబడి ఉంది. పాకిస్తాన్ అనుసరిస్తున్న నిలకబడైన విధానాన్ని అభినందిస్తున్నాం. చర్చలకు ప్రాధాన్యతనిస్తూ, వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునేందుకు పాక్ అనుసరిస్తున్న ధోరణి ప్రశంసనీయం. మీ సంతోష సమాయాల్లోనే కాకుండా, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎప్పుడూ తుర్కియే అండగా నిలుస్తూ వచ్చింది. భవిష్యత్తులోనూ మా మద్దతు కొనసాగుతుంది'' అని ఎర్డోగాన్ పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, భారత పౌర ప్రాంతాలు, మిలటరీ బేస్‌లపై పాకిస్థాన్ జరిపిన దాడుల్లో తుర్కియే డ్రోన్లను ఉపయోగించినట్టు వెల్లడించారు. తుర్కియే తయారుచేసిన ఆసిస్‌గార్డ్ సాంగర్ మోడల్ డ్రోన్లను పాక్ వాడినట్టు చెప్పారు. కాగా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తుర్కియాకు భారత్ చేసిన సాయాన్ని మరిచిపోయి పాక్‌కు మద్దతుగా నిలబడటంపై భారత ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తుర్కియే, అజర్‌బైజాన్‌లను బహిష్కరించాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఇందుకు స్పందించిన 'ఇక్సిగో' ట్రావెల్ అండ్ బుకింగ్ సంస్థ టర్కీ, అజర్‌బైజాన్, చైనాలకు అన్ని విమాన, హోటల్ బుక్సింగ్స్‌ను రద్దు చేస్తునట్టు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 14 , 2025 | 05:05 PM