ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Turkish Drones: టర్కీ షూట్‌

ABN, Publish Date - May 10 , 2025 | 04:34 AM

పాకిస్థాన్‌ తుర్కియే డ్రోన్లు, చౌకబారు క్షిపణులతో భారత్‌పై విరుచుకుపడినా, భారత ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి. శత్రు దాడుల్లో 90% కన్నా ఎక్కువను గాలిలోనే అడ్డుకున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్‌కు ఇచ్చిన టర్కీ

అయినా లెక్క చేయని భారత సైన్యం

పాక్‌ డ్రోన్లను, క్షిపణుల్ని

అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్‌ డిఫెన్స్‌

యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బ తీస్తే సైనిక పరిభాషలో దానిని ‘టర్కీ షూట్‌’ అంటుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో తుపాకులతో షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవారు. ఆ పక్షిని సులభంగా కాల్చినట్లుగా శత్రు పక్షాన్ని అవలీలగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చింది. టర్కీ (ఇప్పుడు తుర్కియే) నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను వందల సంఖ్యలో భారత్‌పై గురి పెట్టిన పాక్‌కు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

తుర్కియే డ్రోన్లను, పాక్‌ క్షిపణుల్ని భారత ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు సులభంగా దెబ్బతీస్తున్నాయి. పాక్‌ ప్రయోగించిన 90 శాతానికి పైగా ఆయుధాలను గాలిలోనే అడ్డుకుని పేల్చివేయగలుగుతున్నాయి. భారత్‌లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలపై గురువారం తెల్లవారుజామున పాక్‌ దాడులు చేసింది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నుంచి జమ్ము, ఉధంపూర్‌ వంటి అనేక చోట్ల భారత సైనిక పోస్టులపై, చివరికి పౌర ఆవాసాలపై కూడా వరస దాడులకు దిగింది. ఇందుకోసం పాక్‌ వివిధ రకాల డ్రోన్లు, క్షిపణుల్ని ఉపయోగించింది. గురువారం నుంచి ఇప్పటివరకూ పాక్‌ 300 నుంచి 400కు పైగా తుర్కియే డ్రోన్లను భారత్‌పైకి ప్రయోగించిందని, వీటిలో అత్యధిక డ్రోన్లను తాము కూల్చివేశామని భారత ఆర్మీ, వైమానిక దళ ప్రతినిధులు శుక్రవారం వెల్లడించారు. ఈ డ్రోన్‌ దాడులు ఆసరాగా భారత్‌లోకి టెర్రరిస్టులు చొరబడేలా పాక్‌ ప్రయత్నించిందని తెలిపారు. ఇప్పటివరకూ పాక్‌ వాడిన డ్రోన్లలో అత్యధికం తుర్కియే నుంచి దిగుమతి చేసుకున్న అసి్‌సగార్డ్‌ సొంగర్‌ డ్రోన్లు అని వారు చెప్పారు. ఈ డ్రోన్లతోపాటు అనేక క్షిపణుల్ని, ఎగిరే బాంబుల్ని పాక్‌ భారత్‌పైకి గురిపెట్టింది. ఈ ఆయుధాల వివరాల్ని పరిశీలిస్తే

ఇలాంటి ఆయుధాలతో పాక్‌ భారత సైన్యంపై, సైనిక స్థావరాలపై దాడులు చేసినా భారత్‌ వాటిని చాలా సమర్థంగా అడ్డుకుంది. సాధారణంగా ఏ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ అయినా శత్రువులు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు అన్నింటినీ అడ్డుకోవడం అసాధ్యం. 80 శాతం ఆయుధాల్ని అడ్డుకోగలిగితే ఆ వ్యవస్థలు చాలా గొప్పగా పనిచేస్తున్నట్లు లెక్క. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇజ్రాయెలీ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ కూడా 90 శాతం టార్గెట్లనే అడ్డుకోగలుగుతోంది. కానీ తాజా ఘర్షణల్లో భారత ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ 90 శాతానికి మించి టార్గెట్లను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. భారత ఎయిర్‌ డిఫెన్స్‌లో రష్యన్‌ ఎస్‌-400, స్వదేశీ ఆకాశ్‌ క్షిపణులు ప్రధాన పాత్ర పోషించాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన జేఎఫ్‌ 17 విమానాన్ని కూల్చింది కూడా మన ఆకాశ్‌ క్షిపణే. ఇవి కాకుండా భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన డ్రోన్‌ జామింగ్‌ వ్యవస్థలు, లేజర్‌ వ్యవస్థలు, స్పైడర్‌, బరాక్‌-8, ఎంఆర్‌శామ్‌, క్యూఆర్‌శామ్‌ వంటి క్షిపణులు కూడా కీలక పాత్ర వహించినట్లు సమాచారం. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఉంటే సరిపోదు. వాటిని ఎక్కడ మోహరించాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. భారత సైన్యం వాటిని సరైన ప్రదేశాల్లో మోహరించడం వల్లే ఎక్కువ టార్గెట్లను ధ్వంసం చేయగలిగింది. అలాగే ఈ వ్యవస్థల్ని ఉపయోగించడంలో సైన్యానికి నిరంతర శిక్షణ, అప్రమత్తత అవసరం. అంతేకాదు... వివిధ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలి. ఒక వ్యవస్థకు అందిన సమాచారాన్ని సకాలంలో మరో వ్యవస్థతో పంచుకోవాలి. ఇవన్నీ సమర్థంగా చేయడంలో భారత సైన్యం విజయవంతమైంది.


అయితే భారత ఎయిర్‌ డిఫెన్స్‌ను దెబ్బతీయడానికి పాక్‌ మరో ఎత్తుగడ వేసింది. పెద్దసంఖ్యలో పనికిరాని చౌకబారు క్షిపణుల్ని, ఆయుధాల్లేని డ్రోన్లను కూడా భారత్‌పైకి ప్రయోగించింది. వీటి వల్ల పెద్దగా నష్టం లేకపోయినా మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల్ని అయోమయంలోకి నెట్టడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు వీటిని కూల్చే పనిలో ఉన్నప్పుడు ఇతర డ్రోన్లు, క్షిపణులు దాడులు చేసేస్తాయి. ఇలాంటి ఎత్తుగడల్ని కూడా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. తుర్కియే డ్రోన్లలో చాలావాటిని యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్స్‌తోను, మరికొన్నింటిని ఎలకా్ట్రనిక్‌ వ్యవస్థలతోను అడ్డుకుంది. మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేయగలిగే ఇంటెగ్రేటెడ్‌ ఎయిర్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ భారత్‌ స్వీయ రక్షణ వ్యూహంలో ప్రధానమైనది. వివిధ రేంజ్‌లు కలిగి, వివిధ ఎత్తుల నుంచి దాడి చేసే క్షిపణులు, డ్రోన్లు, ఎగిరే బాంబులను ఆపాలంటే అంచెలంచెలు కలిగిన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వివిధ రాడార్లు, సెన్సర్లు, కమాండ్‌ పోస్టుల మధ్య అనుసంధానం ఏర్పరచుకోవాలి. యుద్ధాల్లో డ్రోన్లను పెద్ద సంఖ్యలో ఉపయోగించడం అనే ధోరణి ఇటీవలే మొదలైంది. మూడేళ్లకు పైగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో డ్రోన్లు అతి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆ యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని అతి త్వరగా, సమర్థంగా ఆచరణలో పెట్టడం వల్లే భారత్‌ పాక్‌ ఆకాశ దాడులను అద్భుతంగా తిప్పికొడుతోందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి


అసి్‌సగార్డ్‌ సోంగర్‌ డ్రోన్లు

5కిలోమీటర్ల రేంజ్‌ కలిగిన ఈ డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని 2020 నుంచి తుర్కియే సైన్యం వాడుతోంది. ఈ డ్రోన్లు సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఎగురుతాయి. అంతేకాదు దీనికి అమర్చిన తుపాకీ ద్వారా గాలిలో నుంచి బులెట్ల వర్షం కురిపిస్తాయి. ఒక్కో డ్రోన్‌లో 200 బులెట్లు ఫైర్‌ చేయగల గన్‌ అమర్చుతారు. ఈ ఫైరింగ్‌ను ఆపరేటర్‌ కంట్రోల్‌ చేయవచ్చు. లేదంటే దానంతట అదే ఫైర్‌ చేసేలా కూడా ఏర్పాటు చేయవచ్చు. అంటే ఒక్కో డ్రోన్‌ అనేకమందిని చంపగలుగుతుంది. 2024లో దీనిని అప్‌గ్రేడ్‌ చేసి గ్రెనేడ్‌ను కూడా ఫైర్‌ చేసే సామర్థ్యం కల్పించారు.

షాపార్‌ డ్రోన్‌

300 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ కలిగిన డ్రోన్‌ ఇది. నిఘాకు, దాడులకు దీనిని ఉపయోగించవచ్చు.

ఎగిరే బాంబులు

చైనా నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ లాయిటరింగ్‌ మ్యూనిషన్లను ఎయిర్‌బే్‌సలు, రాడార్ల మీదికి ప్రయోగించవచ్చు.

అబ్దాలీ బాలిస్టిక్‌ క్షిపణి

200 కిలోమీటర్ల రేంజ్‌ కలిగిన ఈ క్షిపణితో మిలిటరీ రవాణా కేంద్రాలు, ఆయుధాగారాలపై దాడి చేయవచ్చు.

బాబర్‌ క్రూజ్‌ క్షిపణి

ధ్వని కంటే తక్కువ వేగంతో భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూ రాడార్లకు దొరకకుండా ప్రయాణించే సామర్థ్యం ఉంది. 900 కిలోమీటర్ల రేంజ్‌ ఉండడంతో సరిహద్దుకు దూరంగా ఉన్న లక్ష్యాలపైకి దీనిని ప్రయోగించవచ్చు.

నాసర్‌ బాలిస్టిక్‌ క్షిపణి

సుమారు 70 కిలోమీటర్ల రేంజ్‌ కలిగిన టాక్టికల్‌ క్షిపణి. అణు దాడులకు, మామూలు దాడులకు కూడా దీనిని వాడవచ్చు. సరిహద్దు సమీపంలోని స్థావరాలపై వీటితో దాడులు చేస్తున్నట్టు సమాచారం.

బురాక్‌ అన్‌మ్యాన్డ్‌ కాంబాట్‌ వెహికిల్‌

పాకిస్థాన్‌ దేశీయంగా తయారుచేసింది. వెయ్యి కిలోమీటర్ల రేజ్‌ కలిగిన ఈ డ్రోన్‌ లేజర్‌ గైడెడ్‌ క్షిపణులతో కచ్చితత్వంతో దాడి చేయగలదు.


రాఫెల్స్‌ కూల్చివేత వార్తల్లో నిజమెంత?

మూడు భారత్‌ రాఫెల్‌ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రకటించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ‘‘ఇవిగో రాఫెల్‌ విమాన శకలాలు’’ అంటూ పాకిస్థాన్‌ న్యూస్‌ వెబ్‌సైట్లు ఫొటోలు, వీడియోలతో సహా వార్తలు ఇచ్చా యి. భారత్‌-పాక్‌ సరిహద్దులో ఒక రాఫెల్‌ విమానం కూలిపోయిన మాట నిజమేనని ఫ్రాన్స్‌కు చెందిన ఒక ఇంటెలిజెన్స్‌ అధికారి ధ్రువీకరించినట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది. దీనితో పాక్‌ మీడియా ఇచ్చిన ఫేక్‌ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ దీనిపై లోతుగా ఆరా తీయగా ఆ ఫ్రెంచ్‌ అధికారి భారత్‌కు చెందిన ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వెబ్‌సైట్‌లో వచ్చిన వార్త ఆధారంగా అలా చెప్పినట్లు స్పష్టమైంది. దీనిపై ఆ పత్రికను సంప్రదించగా తాము పొరపాటున తప్పుడు వార్త ఇచ్చామని, దానిని తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించామని సమాధానం ఇచ్చారు. ఒక మిరాజ్‌ విమానం డ్రాప్‌ ట్యాంక్‌ తాలూ కు శకలాలను తాము విమాన శకలాలుగా పొరబడినట్లు తెలిపారు. (డ్రాప్‌ ట్యాంక్‌ అంటే... యుద్ధ విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు వాటి కింది భాగంలో తాత్కాలికంగా అమర్చే ఇంధన ట్యాంకులు. యుద్ధ విమానాలు వేగంగా ప్రయాణించాలని అనుకున్నప్పుడు, బరువు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ డ్రాప్‌ ట్యాంకుల్ని కిందికి జార విడిచి వెళ్లిపోతాయి) ఈ డ్రాప్‌ ట్యాంకుపై ఫ్రెంచ్‌ అక్షరాలు ఉండడంతో దానిని రాఫెల్‌ విమానంగా ఆ పత్రిక పొరపాటుపడిందని సమాచారం. ఇక పాక్‌కు చెందిన యుద్ధ విమానం ఒకటి భారత రాఫెల్‌ విమానాన్ని కూల్చివేసిందంటూ ఒక వీడియోను పాక్‌ మీడియా చూపుతోంది. అయితే ఆ వీడియో 2025 ఏప్రిల్‌లో పొలాల్లో కూలిపోయిన పాక్‌ మిరాజ్‌ విమానం తాలూకుదని ఫ్యాక్ట్‌ చెక్‌లో వెల్లడైంది. భారత్‌కు చెందిన ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు పాక్‌ ఆర్మీ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఒక ఫొటో పోస్టు చేసింది. అయితే ఈ ఫొటోలో ఉన్నది రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో 2022లో కూలిన ఇరాన్‌ డ్రోన్‌ తాలూకుదని బయటపడింది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:34 AM