ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahua Moitra: వివాహంపై నోరు విప్పని ఎంపీ.. ఫొటో వైరల్

ABN, Publish Date - Jun 05 , 2025 | 02:52 PM

బీజేడీ మాజీ ఎంపీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా వివాహం చేసుకున్నారు. మంగళవారం విదేశాల్లో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా వెల్లడించింది.

Trinamool MP Mahua Moitra with Pinaki Misra,

న్యూఢిల్లీ, జూన్ 05: మాజీ ఎంపీ పినాకి మిశ్రాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మహువా మోయిత్రా వివాహం చేసుకున్నారు. మే 3వ తేదీన ఈ వివాహం విదేశాల్లో జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియా గురువారం వెల్లడించింది. అందుకు సంబంధించి ఒక ఫోటోను ఈ సందర్బంగా ప్రదర్శించింది. భారీగా నగలు ధరించిన మహువా మోయిత్రా.. భర్త పినాకి మిశ్రా చేయి పట్టుకొని వెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. కానీ ఈ విషయాన్ని పినాకి మిశ్రా కానీ.. మహువా మోయిత్రా కానీ ఇంత వరకు ధృవీకరించక పోవడం గమనార్హం.

1974, అక్టోబర్ 12వ తేదీన అసోంలో మహువా మోయిత్రా జన్మించారు. తొలుత ఇన్వెస్టమెంట్ బ్యాంకర్‌ ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అంటే.. 2010లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణ నగర్ లోక్ సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో సైతం ఆమె ఇదే స్థానం నుంచి విజయం సాధించారు.


1959, అక్టోబర్ 23వ తేదీన ఒడిశాలోని పూరీలో పినాకి మిశ్ర జన్మించారు. సీనియర్ న్యాయవాది మాత్రమే కాదు.. ఆయన ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బీఏ హానర్స్ పట్టా అందుకున్నారు అనంతరం ఢిల్లీ యూనివర్శిటీలో ఎల్ఎల్‌బీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996లో పూరీ లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. అనంతరం ఆయన బీజూ జనతాదళ్ పార్టీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి పలుమార్లు ఆయన ఎంపీగా 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు.

ఈ వార్తలు కూడా చదవండి..

చట్టసభ సభ్యులకు ఎలాన్ మాస్క్ కీలక సూచన

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: పలువురు మావోయిస్టులు మృతి

For National News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 10:23 PM