Pahalgam Terror Attack: ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
ABN, Publish Date - Apr 23 , 2025 | 06:57 PM
Pahalgam Terror Attack: పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ(సీసీఎస్) అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చి్స్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌కు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ(సీసీఎస్) అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌కు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. అటు నుంచి వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.
ఉగ్రదాడిపై స్పందించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పాకిస్తాన్‌కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే.. ‘ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ప్రజలుకు హామీ ఇస్తున్నాను. ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడమే కాకుండా.. తెర వెనుక కూర్చుని భారత గడ్డపై ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారికి గుణపాఠం నేర్పుతాం’ అని రాజ్‌నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని పర్యాటక కేంద్రమైన బైసారన్ మైదానంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది టూరిస్టులు చనిపోయారు. 2019 పుల్వామా దాడి తరువాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి. దీనికి ప్రతీకార చర్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా దాడి తరువాత భారత్.. ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. ఇప్పుడు కూడా అదే తరహాలో దాడి చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ప్రధాని నేతృత్వంలో జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
Also Read:
ఉగ్ర వేట.. జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
సగం సీజన్‌కే 111 క్యాచులు మిస్
For More National News and Telugu News..
Updated Date - Apr 23 , 2025 | 07:32 PM