Share News

IPL 2025 Dropped Catches: సగం సీజన్‌కే 111 క్యాచులు మిస్.. ఇది ఐపీఎలా.. గల్లీ క్రికెటా..

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:59 PM

Today IPL Match: క్రీడా ప్రపంచంలో బెస్ట్ లీగ్స్‌లో ఒకటిగా పేరుగాంచిన ఐపీఎల్‌లో సీజన్ సీజన్‌కూ ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోతున్నాయి. దారుణమైన ఫీల్డింగ్‌తో లీగ్ పరువు తీస్తున్నారు కొందరు ఆటగాళ్లు. అసలు ఇది ఐపీఎలా లేదా గల్లీ క్రికెటా అనే డౌట్స్ వచ్చేలా చేస్తున్నారు.

IPL 2025 Dropped Catches: సగం సీజన్‌కే 111 క్యాచులు మిస్.. ఇది ఐపీఎలా.. గల్లీ క్రికెటా..
IPL Catching Efficiency

క్రికెట్‌లోనే కాదు.. ఇతర వరల్డ్ స్పోర్ట్స్‌లోనూ అతిపెద్ద లీగ్స్‌లో ఒకటిగా పేరుగాంచినది ఐపీఎల్. బీసీసీఐకి బంగారు గుడ్లు పెట్టే ఈ క్యాష్ రిచ్ లీగ్ వల్ల ఆటగాళ్లు కూడా కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. అటు యంగ్‌ ప్లేయర్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లతో జాతీయ జట్టులోకి వచ్చేస్తున్నారు. ఇలా ఎంతో కీలకంగా మారిన ఐపీఎల్‌లో లోకల్ ప్లేయర్స్‌తో పాటు టీమిండియా స్టార్లు, ఇతర దేశాల బిగ్ ప్లేయర్స్ కూడా ఆడుతుండటంతో వరల్డ్ వైడ్‌గా ఫుల్ పాపులర్ అయిపోయింది. అయితే ఇంత పేరున్న లీగ్ ఇప్పుడు పరువు తీసుకుంటోంది. ఐపీఎల్ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారుతోంది. దీనికి రీజన్ చెత్త ఫీల్డింగే.


ఇంత దారుణమా..

ఐపీఎల్-2025 చెత్త ఫీల్డింగ్‌కు అడ్డాగా మారింది. ఈ సీజన్‌లో ఒకటి, రెండూ కాదు.. 40 మ్యాచులు ముగిసేసరికి ఏకంగా 111 మిస్ క్యాచులు నమోదయ్యాయి. అన్ని జట్ల ప్లేయర్లు కలిపి సెంచరీకి పైగా క్యాచులు నేలపాలు చేశారు. యువ ఆటగాళ్లు, బౌలర్లతో పాటు బెస్ట్ ఫీల్డర్లుగా ప్రసిద్ధి గాంచిన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మనీష్ పాండే కూడా క్యాచులు జారవిడవడం ఆందోళనకరమనే చెప్పాలి. ఈ సీజన్‌లో క్యాచింగ్ ఎఫిషియన్సీ 75.2 శాతంగా ఉంది. క్యాచులే కాదు.. 172 రనౌట్లు మిస్ చేశారు ఫీల్డర్లు. మొత్తంగా 247 మిస్ ఫీల్డ్స్ నమోదయ్యాయి. దీన్ని బట్టే ఈ సీజన్‌లో ఫీల్డింగ్ ప్రమాణాలు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. అసలు ఇది ఐపీఎలా.. గల్లీ క్రికెటా.. ఇంత చెత్త ఫీల్డింగ్ ఏంటి బాసూ అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్లేయర్లు ఎంత డెడికేషన్‌, డిసిప్లిన్‌తో ఆడితే గేమ్ అంత బాగుంటుందని అంటున్నారు. ఇలా ఆటను లైట్ తీసుకుంటే క్రమంగా లీగ్‌ను అభిమానులు లైట్ తీసుకునే ప్రమాదం ఉందని సీరియస్ అవుతున్నారు.


ఇవీ చదవండి:

సన్‌రైజర్స్‌కు లాస్ట్ చాన్స్

న్యాయం జరగాల్సిందే.. స్టార్ల డిమాండ్

పంత్ కావాలనే చేస్తున్నాడా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 23 , 2025 | 06:07 PM