Pahalgam Attack: దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ అధిష్టానం
ABN, Publish Date - Apr 28 , 2025 | 04:48 PM
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో... తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ దాడులపై పార్టీ స్టాండ్ ఏమిటన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది. అలాంటి వేళ పార్టీ అధిష్టానం స్పందించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతోన్నాయి. ఆ నాయకుల వ్యాఖ్యల కారణంగా.. ఆ పార్టీ తీవ్ర విమర్శల ఎదుర్కొవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించింది. పార్టీ మార్గదర్శకాలను కట్టుబడి ఉండాలని నేతలకు స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయవద్దంటూ పార్టీ నేతలకు అధిష్టానం క్లియర్ కట్‌గా సూచించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతోపాటు ఆయన కేబినెట్‌లోని మరో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆ క్రమంలో ఈ దాడులపై పార్టీ వైఖరిపై సర్వత్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నేతలకు స్పష్టం చేసింది. అంతేకానీ.. ఎవరి నిర్ణయాలు వారు బాహటంగా చెప్పకూడదని సూచించింది. పహల్గాం దాడి ఘటనపై భవిషత్తులో పార్టీ చేసే ప్రకటనకు నిబద్దతో కట్టుబడి ఉండాలని నాయకులను ఆదేశించింది.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఐదు నుంచి ఆరుగురు తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రదాడితో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారాయి.
వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్‌తో యుద్ధం అవసరం లేదని, దీనికి బదులుగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు. ఈ వాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీంతో ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. అనివార్యమైతే..పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
AP Ministers: మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి
Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..
Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్
Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..
For National News And Telugu News
Updated Date - Apr 28 , 2025 | 04:49 PM