Air India Black Box: బ్లాక్ బాక్స్ ఊహాగానాలపై కేంద్ర మంత్రి క్లారిటీ
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:18 PM
అహ్మదాబాద్ డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన మరుసటి రోజే బ్లాక్ బాక్స్‌ను అధికారులు కనుగొన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికా పంపినట్టు తాజాగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్‌కు బయలు దేరిన ఎయిరిండియా విమానం (AI171) గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలడం పెను విషాదాన్ని నింపింది. విమానంలోని 241 మందితో సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మరుసటి రోజే ఘటనా స్థలిలో డ్రీమ్‌లైనర్ విమానం బ్లాక్ బాక్స్‌ను అధికారులు కనుగొన్నారు. అయితే బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికా పంపినట్టు తాజాగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (K Rammohan Naidu) మంగళవారంనాడు తోసిపుచ్చారు.
'అవన్నీ ఊహాగానాలే. బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉంది. ప్రస్తుతం దీనిని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) పరిశీలిస్తోంది' అని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎప్పటిలోగా బ్లాక్ బాక్స్‌లోని సమాచారాన్ని వెలికితీసే అవకాశం ఉందని అడిగినప్పుడు, ఏఏఐబీ దర్యాప్తు చేపట్టి మొత్తం ప్రక్రియను పరిశీలించనీయండని అన్నారు. విమానం కూలిపోవడానికి ముందు ఏమి జరిగిందో లోతుగా తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ డీకోడింగ్ జరుగుతోందని ఇంతకుముందు మంత్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి
హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్..
For National News And Telugu News
Updated Date - Jun 24 , 2025 | 04:22 PM