Minister: రాష్ట్రంలో దశలవారీగా మద్యం దుకాణాల మూసివేత
ABN, Publish Date - Aug 13 , 2025 | 01:24 PM
రాష్ట్రంలో దశలవారీగా టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని గృహ, ఎక్సైజ్‌శాఖ మంత్రి ఎస్.ముత్తుస్వామి పేర్కొన్నారు. ఈరోడ్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టాస్మాక్ మద్యం చిల్లర దుకాణాలను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఈ నాలుగేళ్లలో 500 దుకాణాలు మూసివేసినట్లు మంత్రి తెలిపారు.
- మంత్రి ఎస్.ముత్తుస్వామి
చెన్నై: రాష్ట్రంలో దశలవారీగా టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని గృహ, ఎక్సైజ్‌శాఖ మంత్రి ఎస్.ముత్తుస్వామి(Minister Muttuswami) పేర్కొన్నారు. ఈరోడ్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టాస్మాక్ మద్యం చిల్లర దుకాణాలను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఈ నాలుగేళ్లలో 500 దుకాణాలు మూసివేసినట్లు మంత్రి తెలిపారు. టాస్మాక్ దుకాణాలు లేని ప్రాంతాల్లో కల్తీసారాయి,
పొరుగురాష్ట్రాల నుంచి చట్టవిరుద్ధంగా తరలించే మద్యం విక్రయించకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతోనే డీఎంకే ప్రభుత్వం టాస్మాక్ దుకాణాలను నడుపుతోందని తెలిపారు. టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించడంపై రాజకీయ పార్టీలు, ప్రజలు న్యాయస్థానం తెలిపే అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. మద్యం బాటిళ్లకు అదనంగా నగదు వసూలు చేసిన 451 మంది ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 13 , 2025 | 01:24 PM