WhatsApp: రేషన్ కార్డు నుంచి బస్ టిక్కెట్ల వరకు.. ఇక వాట్సాప్‌లో సర్కారు సేవలు
ABN, Publish Date - Aug 15 , 2025 | 12:39 PM
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను మరింత సులభతరం చేయనుంది. రేషన్ కార్డు నుంచి బస్ టిక్కెట్ల వరకు తొలి దశలో 50 సేవలను అందించనుంది. ఇందుకోసం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాతో ప్రభుత్వం ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళం, ఆంగ్ల భాషల్లో ఏఐ (కృత్రిమ మేథ) టెక్నాలజీతో వీటిని ప్రజల వద్దకు చేర్చనుంది.
- ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాతో కీలక ఒప్పందం
చెన్నై: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను మరింత సులభతరం చేయనుంది. రేషన్ కార్డు నుంచి బస్ టిక్కెట్ల వరకు తొలి దశలో 50 సేవలను అందించనుంది. ఇందుకోసం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాతో ప్రభుత్వం ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళం, ఆంగ్ల భాషల్లో ఏఐ (కృత్రిమ మేథ) టెక్నాలజీతో వీటిని ప్రజల వద్దకు చేర్చనుంది. ఉదాహరణకు ఏదైనా ఒక సేవను పొందగోరు వారు దానికి సంబంధించిన అన్ని రకాల ధ్రువ పత్రాలను వాట్సా్‌పలోనే అప్‌లోడ్ చేసి, వాట్సాప్(WhatsApp) లోనే ఆ సేవ రుసుం కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సేవలను వచ్చే మూడు నెలల్లో ప్రారంభించనున్నారు. గత ఏప్రిల్ లో అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఈ విషయానిన వెల్లడించారు. ఆ ప్రకారంగానే ఇపుడు ఈ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు వీలుగా మెటాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సెక్యూరిటీ పరంగా ఓటీపీతో పాటు మరికొన్ని భద్రతా ప్రమాణాలను పాటించనున్నారు. రేషన్ కార్డు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్ను చెల్లింపులు, వాణిజ్య అనుమతులు పొందడం,
బస్సు టిక్కెట్ రిజర్వేషన్, రేషన్ కార్డుల్లో చిరునామా మార్పు, ఆదాయం, ఫస్ట్‌గ్రేడ్ డిగ్రీ సర్టిఫికెట్, మెట్రో వాటర్, ఆస్తి పన్ను చెల్లింపులు, డ్రైనేజీ పన్ను చెల్లింపు, రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు, చేరిక ఇలా సుమారుగా 50 సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత మరికొన్ని సేవలు తీసుకొచ్చేలా తమిళనాడు ఆన్‌లైన్ సేవల విభాగం దృష్టిసారించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ-సేవా కేంద్రాల ద్వారా లభించే 35843 సేవలను వాట్సా్‌పలోనే అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ కొత్త ప్రయత్నం వల్ల ప్రభుత్వం సేవలను ప్రజలు మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుంది. వాట్సా్‌పలో ఏ సమయంలోనైనా, ఎలాంటి సేవనైనా సులభంగా పొందే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News
Updated Date - Aug 15 , 2025 | 12:39 PM