ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

ABN, Publish Date - Mar 16 , 2025 | 03:22 PM

రెహ్మాన్ ఆదివారం ఉదయం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియాగ్రామ్ చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది.

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరాడన్న వార్తల నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అప్‌డేట్ ఇచ్చారు. రెహమాన్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ఆయన డిశ్చార్జి అవుతారని చెప్పారు. "అనారోగ్యంతో ఏఆర్ రెహమాన్ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే డాక్టర్లను సంప్రదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. రెహమాన్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ఆయనను ఇంటికి పంపుతామని వైద్యులు తెలిపారు" అని స్టాలిన్ పేర్కొన్నారు.

AR Rahman : ఎమర్జెన్సీ వార్డులో ఏఆర్ రెహమాన్.. స్పందించిన కుమారుడు..


రెహమాన్ ఆదివారం ఉదయం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియాగ్రామ్ చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన రిపోర్టుల్లో ఆయన ఆరోగ్యం నిలకబడగా ఉందని తేలింది. ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరినట్టు తొలి వార్తలు వచ్చాయి. అయితే, లండన్ నుంచి తిరిగివచ్చాక డీహైడ్రేషన్, మెడకు సంబంధించిన ఇబ్బందులను ఆయన ఎదుర్కొంటున్నట్టు ఆ తర్వాత తేలింది.


రెహమాన్ ఇటీవల తన భార్య సైరాబానుతో విడిపోతున్నట్టు ప్రకటించారు. బాను సైతం ఇటీవల మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరడంతో శస్త్రచికిత్స జరిగింది. ప్రొఫెషన్ పరంగా చూసినప్పుడు రెహమాన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల తమిళ చిత్రం 'కాదలిక్క నేరమిల్లై', విక్కీ కౌషల్ "ఛావా''కు సంగీతం అందిచారు. తాజాగా కమల్‌హాసన్ "థగ్ లైఫ్'', ''హోర్ 1947'', ''తేరే ఇస్క్ మే'', "ది రామాయన్'' సిరీస్, రామ్‌చరణ్ ''ఆర్‌సీ 16''లకు సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:52 PM