ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elections: ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:14 PM

రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక పోలింగ్‌ కేంద్రంలో 1,200 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌(Archana Patnayak) తెలిపారు. సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు

- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌

చెన్నై: రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక పోలింగ్‌ కేంద్రంలో 1,200 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌(Archana Patnayak) తెలిపారు. సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్లు సెల్‌ఫోన్లు తీసుకెళ్లడంపై ఈసీ నిషేధం విధించిందని, అందుకోసం పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు సెల్‌ఫోన్‌ భద్రపరచుకొనేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నామన్నారు.

ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, వాటిని విభజించి ఒక్కో కేంద్రంలో 1,200 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అందుకోసం అదనపు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసే ప్రాంతాలు ఎంపిక చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 68,400 పోలింగ్‌ కేంద్రాలుండగా, 1,200 మంది ఓటర్లకు ఒక కేంద్రం ఏర్పాటుతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ఓటర్ల జాబితా పరిశీలన పనులు అక్టోబరు నుంచి ప్రారంభించనున్నట్లు అర్చనా పట్నాయక్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.

పెరిగిన గోల్డ్, వెండి ధరలు..

హలం పట్టి.. పొలం దున్ని..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 12 , 2025 | 12:14 PM