ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tahawwur Rana: పాటియాలా కోర్టుకు తహవ్వుర్ రాణా.. 12 రోజుల కస్టడీ కోరిన ఎన్ఐఏ

ABN, Publish Date - Apr 28 , 2025 | 03:34 PM

ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో రాణా ప్రస్తుతం ఎన్ఐఏ విచారణను ఎదుర్కొంటున్నారు. రాణాను న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ముందు హాజరుపరిచినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ సారథ్యంలోని ఎన్ఐఏ లీగల్ టీమ్ కూడా కోర్టుకు హాజరైంది.

న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఇటీవల ఇండియాకు తీసుకొచ్చిన 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వుర్ రాణా (Tahawwur Rana)ను భారీ భద్రత మధ్య పాటియాలా హౌస్ కోర్టు ముందు సోమవారంనాడు హాజరుపరిచారు. తహవ్వుర్ రాణాకు కోర్టు ఆదేశించిన 18 రోజుల ఎన్ఐఏ (NIA) కస్టడీ ఈరోజు ముగియనుండటంతో కోర్టు ముందు ఆయనను హాజరుపరిచారు. మరో 12 రోజులు ఆయనను కస్టడీకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును ఎన్ఐఏ కోరింది.

Ranveer Allahbadia: రణ్‌వీర్ అల్హాబాదియాకు సుప్రీం బిగ్ రిలీఫ్


ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో రాణా ప్రస్తుతం ఎన్ఐఏ విచారణను ఎదుర్కొంటున్నారు. రాణాను న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ముందు హాజరుపరిచినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ సారథ్యంలోని ఎన్ఐఏ లీగల్ టీమ్ కూడా కోర్టుకు హాజరైంది.


ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఇటీవల రాణాను దాదాపు 8 గంటల సేపు విచారణ జరిపారు. విచారణకు రాణా సహకరించకుండా, తప్పించుకునే రీతిలో సమాధానాలు చెప్పారని, ముంబై ఉగ్రదాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడని తెలుస్తోంది.


దీనికి ముందు, తన కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడేందుకు అనుమతించాలని రాణా చేసిన విజ్ఞప్తిని పాటియాల్ హౌస్ కోర్టు తోసిపుచ్చింది. రాణా విదేశీయుడని, తన కుటుంబంతో మాట్లాడే ప్రాథమిక హక్కు ఉందని, కస్టడీలో ఉన్న రాణా ట్రీట్‌మెంట్‌పై వారు ఆందోళన చెందుతున్నారని రాణా తరఫు న్యాయవాది పీయూష్ సచ్‌దేవ కోర్టుకు విన్నవించారు. అయితే దీనిపై ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ జరుగుతున్నందున, సున్నితమైన సమాచారాన్ని అతను బయటకు వెల్లడించే అవకాశం ఉంటుందని పేర్కొంది. దీంతో రాణా పిటిషన్‌ను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ తోసిపుచ్చారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 03:36 PM