Home » National Investigative Agencies
యూఎస్ నుంచి డిపోర్ట్ కాగానే అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్‌కు ప్రస్తుతం జైలులో ఉన్న అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్ సిండికేట్‌తో ప్రమేయముంది.
ఢిల్లీ కారు బాంబు దాడి కేసుకు సంబంధించి మరో వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్‌ను ముమ్మరం చేశాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో పట్టుబడ్డ మహిళా డాక్టర్ షాహీన్.. నిధుల సమీకరణలో కీలకంగా వ్యవహరించినట్టు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
భారీ పేలుడు నేపథ్యంలో ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారంనాడు తన నివాసంలో రెండోసారి అత్యున్నత భద్రతా స్థాయి సమావేశం నిర్వహించారు.
లష్కరే తొయిబా ముసుగు సంస్థ అయిన టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థను పాకిస్థాన్ ఏర్పాటు చేసింది. దీనిని జమ్మూకశ్మీర్‌లో వేళ్లూనుకునేలా చేసి స్థానిక సంస్థగా ప్రాజెక్ట్ చేసింది. తద్వారా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు కొనసాగించడం, ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) స్క్రూటినీలోకి రాకుండా చూసుకోవడం పాక్ వ్యూహంగా ఉన్నట్టు ఎన్ఐఏ పేర్కొంది.
ఆరిఫ్ దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాదులకు ఆయుధాలను సమకూర్చుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
పహల్గామ్ ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు తమపై నాలుగు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు కూడా నలుగురి కంటే ఎక్కువ మందే దాడిలో పాల్గొన్నారని, ఉగ్రవాదులతోపాటు స్థానికులు కూడా భాగమయ్యారని అభిప్రాయపడ్డారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాకిస్థాన్ టూర్‌కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకి చిక్కింది.
ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని ఎన్ఐఏ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం ఉంటే వాటిని స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది.
ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో రాణా ప్రస్తుతం ఎన్ఐఏ విచారణను ఎదుర్కొంటున్నారు. రాణాను న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ముందు హాజరుపరిచినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ సారథ్యంలోని ఎన్ఐఏ లీగల్ టీమ్ కూడా కోర్టుకు హాజరైంది.