Former Maoist Gade Innaiah: బిగ్ బ్రేకింగ్: మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్యపై NIA కేసు
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:55 PM
వరంగల్ జిల్లా జాఫర్‌ఘడ్‌లో మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇన్నయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వరంగల్: మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు కేసు నమోదు చేశారు. జాఫర్‌ఘడ్‌లోని ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నయ్య ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు రావటం చర్చనీయాంశంగా మారింది.
భావోద్వేగ ప్రసంగం..
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ పిల్లి.. స్టార్ హోటల్ ‘అంబాసిడర్’ మరి...
దోమలు బాబోయ్.. పెరుగుతున్న బోదకాలు వ్యాధి వ్యాప్తి