Vizianagaram Terror Plot: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడు అరెస్ట్
ABN , Publish Date - Aug 28 , 2025 | 09:52 PM
ఆరిఫ్ దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాదులకు ఆయుధాలను సమకూర్చుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
ఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాడు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను హాజరుపరచనున్నారు. ఆరిఫ్ దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
ఉగ్రవాదులు సిరాజ్, సమీర్లతో కలిసి ఆరిఫ్ పని చేశాడు. ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్‌ను తీసుకెళ్తుండగా సమీర్, సిరాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరూ అరెస్ట్ కావటంతో ఆరిఫ్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే దేశం విడిచి పారిపోవడానికి చూశాడు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు గురువారం నాడు అతడ్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో హై అలర్ట్