CM Revanth Reddy: వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Aug 28 , 2025 | 08:43 PM
వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారికి, పంటలు నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. నష్టపరిహారానికి సంబంధించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఫోన్‌లో చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు.
వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారి కుటుంబాలకు, పంటలు నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు (CM Revanth Reddy). నష్టపరిహారానికి సంబంధించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఫోన్‌లో చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమీక్ష కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు (Telangana Floods).
కేంద్రం నుంచి అత్యవసరంగా నిధులు కోరేలా రిపోర్ట్ తయారు చేయాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. వరద తగ్గగానే పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితిల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను గుర్తించి, వాటిల్లో ఉన్న విద్యార్థులను వేరే చోటుకు మార్చాలని సూచించారు. రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలకు పక్కా భవనం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని హామీనిచ్చారు. ఇక, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క కూడా వరదలపై సమీక్షించారు. కామారెడ్డి లో జరిగింది ప్రకృతి విపత్తు అని, వర్షాలు తగ్గగానే పంట నష్టాన్ని అంచనా వేసి అందరినీ ఆందుకుంటామని అన్నారు. నష్టంపై సీఎంకు నివేదిక ఇస్తామని, కేంద్రం కూడా సహకరించాలని, రెండు మూడు రోజులలో రవాణా మెరుగుపరుస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..