Youth Swept Away In Suryapet: యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..
ABN , Publish Date - Aug 28 , 2025 | 06:34 PM
ముగ్గురు యువకులు ఉధృతంగా పొంగి పొర్లుతున్న వాగు దాటాలని పందెం వేసుకున్నారు. పందెంలో భాగంగా ముగ్గురూ వాగు దాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద పోటెత్తడంతో ఓ యువకుడు కొట్టుకుపోయాడు.
సూర్యాపేట: గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లాలో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పొంగిపొర్లుతున్న వాగు దాటే పందెం వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. వరదలో కొట్టుకుపోయాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతగిరి మండలం గొండ్రియాలలో పాలేరు వాగు పొంగిపొర్లుతోంది. ఏం పిచ్చిపట్టిందో ఏమో కానీ, ఓ ముగ్గురు యువకులు ఉధృతంగా పొంగి పొర్లుతున్న వాగు దాటాలని పందెం వేసుకున్నారు. పందెంలో భాగంగా ముగ్గురూ వాగు దాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద పోటెత్తడంతో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు వాగు దగ్గరకు చేరుకున్నారు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ పాలేరు వాగు వద్దకు చేరుకున్నారు.
మరోవైపు హైదరాబాద్ చాదర్ ఘాట్ శంకర్ నగర్ వద్ద మూసీలో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. శంకర్ నగర్‌కు చెందిన సలీం ఖురేషి(40) ఈత కొడుతూ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కాగా, ఖురేషి కోసం హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇవి కూడా చదవండి
బ్యాడ్‌లక్ అంటే ఇదే.. రెండు ఎద్దుల మధ్య పోరాటంలో ఓ యువతి పరిస్థితి చూడండి..
భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు, పరీక్షలు రద్దు