Share News

shocking bull video: బ్యాడ్‌లక్ అంటే ఇదే.. రెండు ఎద్దుల మధ్య పోరాటంలో ఓ యువతి పరిస్థితి చూడండి..

ABN , Publish Date - Aug 28 , 2025 | 06:27 PM

అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా క్షేమంగా బయటపడవచ్చు. అదే టైమ్ బాగోలేకపోతే మాత్రం సంబంధం లేని ప్రమాదాలు కూడా ఎదురవుతుంటాయి. తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది. రెండు ఎద్దులు పోరాడుకుంటూ ఓ యవతి మీదకు దూసుకొచ్చాయి.

shocking bull video: బ్యాడ్‌లక్ అంటే ఇదే.. రెండు ఎద్దుల మధ్య పోరాటంలో ఓ యువతి పరిస్థితి చూడండి..
girl stuck between bulls,

అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా క్షేమంగా బయటపడవచ్చు. అదే టైమ్ బాగోలేకపోతే మాత్రం సంబంధం లేని ప్రమాదాలు కూడా ఎదురవుతుంటాయి. తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది. రెండు ఎద్దులు పోరాడుకుంటూ ఓ యవతి మీదకు దూసుకొచ్చాయి. దీంతో ఆ యువతి గాయాలపాలైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు (girl stuck between bulls).


iamankit. అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మీద రెండు ఎద్దులు పోరాడుతున్నాయి. ఒక ఎద్దు మరో దానిని తన కొమ్ములతో వెనక్కి నెట్టడం ప్రారంభించింది. దీంతో ఆ రెండు ఎద్దులో తోసుకుంటూ వెనక్కి వేగంగా వెళ్లాయి. అదే సమయంలో ఓ యువతి తన స్కూటీతో రోడ్డు పైకి వచ్చింది. ఈ రెండు ఎద్దులు ఢీకొనడంతో ఆ స్కూటీతో సహా ఆ అమ్మాయి కింద పడిపోయింది. స్వల్పంగా గాయపడిన ఆ యువతి వెంటనే లేచి నిలబడింది (bull fight accident).


ఈ ఘటనకు సంబంధించిన వీడియోను (shocking bull video) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 18 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ అమ్మాయిని పడగొట్టడానికే ఆ రెండు ఎద్దులు ఫైట్ చేసుకున్నాయని ఒకరు కామెంట్ చేశారు. ఆ ఎద్దుల లక్ష్యం నెరవేరింది అని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..

రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2025 | 06:27 PM