Share News

Krishna District Flood Update: కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో హై అలర్ట్

ABN , Publish Date - Aug 28 , 2025 | 08:31 PM

కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీవోలను ఆదేశించారు.

Krishna District Flood Update: కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో హై అలర్ట్
Krishna District Flood Update

కృష్ణజిల్లా, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదిలో (Krishna River) వరద ఉదృతి నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణజిల్లా కలెక్టర్ బాలాజీ (Collector Balaji) తెలిపారు. వరద బాధితులు ఎవరైనా సహాయక చర్యల కోసం ఈ నంబర్‌లో 08672 252572 సంప్రదించాలని సూచించారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీవోలను ఆదేశించారు కలెక్టర్ బాలాజీ.


వరద ఉధృతి మరింత పెరిగితే లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. బుడమేరు పరిధిలో కూడా కొంత వర్షపాతం నమోదు కావడంతో గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల తాకిడికి గురైన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంత గ్రామస్తులను అప్రమత్తం చేశామని చెప్పుకొచ్చారు. తోట్లవల్లేరు మండలంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించాలని ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు కలెక్టర్ బాలాజీ.


అవనిగడ్డ నియోజకవర్గం ఎడ్లంక గ్రామంలో వరద ప్రవాహం తీవ్రంగా ఉందని వెల్లడించారు. గతంలో సంభవించిన వరదల కారణంగా ఎడ్లంక ప్రాంతంలో భూమి కోతకు గురవుతోందని చెప్పుకొచ్చారు. వరదలతో ఇప్పటి వరకు జిల్లాలో పంట నష్టం జరగలేదని తెలిపారు. జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టిందని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుదాఘాతంతో యువకుడు మృతి.. పవన్ కల్యాణ్ విచారం

భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

For AP News And Telugu News

Updated Date - Aug 28 , 2025 | 08:34 PM