Share News

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Aug 27 , 2025 | 03:16 PM

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్
Minister Savita VS YSRCP

చిత్తూరు, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై (Bhumana Karunakar Reddy) ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత (Minister Savita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు తమ ప్రభుత్వం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సవిత.


గత జగన్ ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించిన 20 ఎకరాల భూములను హిందూ ధర్మానికి వ్యతిరేకంగా తాజ్ హోటల్‌కి కేటాయించిందని గుర్తుచేశారు. ఇవాళ(బుధవారం) వినాయక చవితి (Vinayaka Chaviti) సందర్భంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం (Kanipakam temple) స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని మంత్రి సవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సవిత మాట్లాడారు. ఏపీలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయకుడిని కోరుకున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.


నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: హోం మంత్రి అనిత

Minister-Anitha.jpg

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, పోలీస్ కుటుంబ సభ్యులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల కోసం రూ.25 కోట్లు వెచ్చించి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు.


డూండీ గ‌ణేష్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ దంప‌తుల పూజలు

అలాగే.. వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా విజ‌య‌వాడ‌లోని 72 అడుగుల శ్రీ కార్య‌సిద్ది మ‌హాశ‌క్తి గ‌ణ‌ప‌తి(డూండీ గ‌ణేష్) విగ్ర‌హానికి స‌తీస‌మేతంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ (MP Kesineni Sivanath) దంపతులు (చిన్ని), జాన‌కి ల‌క్ష్మి పూజ‌లు చేశారు. బొజ్జ‌గ‌ణ‌ప‌య్య‌కు స‌తీస‌మేతంగా ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఎంపీ కేశినేని శివనాథ్ దంప‌తుల‌కు డూండీ గణేష్ సేవా సమితి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఈ ఏడాది డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల శ్రీ కార్య‌సిద్ది మ‌హాశ‌క్తి గ‌ణ‌ప‌తి మ‌ట్టి విగ్ర‌హం ఏర్పాటు చేశామని తెలిపారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలని శివనాథ్ దంప‌తులు ప్రార్థించారు. వినాయకుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..

For AP News And Telugu News

Updated Date - Aug 27 , 2025 | 03:29 PM