Kanipakam Temple: పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:33 AM
వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా కాణిపాకం ఆలయాన్ని ముస్తాంబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున గణేష్ మాల ధారణ ధరించి స్వామివారికి ఇరుమడి దీక్షలను సమర్పించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకోనున్నారు.
చిత్తూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాకం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్షేత్రం ఒక్కసారిగా భక్త సందడిగా మారిపోయింది. నేటి నుంచి 21 రోజులు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో.. భక్తులు స్వామి వారిని చూడటానికి వివిధ ప్రదేశాల నుంచి తరలివస్తున్నారు. ఈ మేరకు ఆలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, ఉదయం 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారికి ఉభయ దారులు ఆనవాయితుగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా కాణిపాకం ఆలయాన్ని ముస్తాంబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున గణేష్ మాల ధారణ ధరించి స్వామివారికి ఇరుమడి దీక్షలను సమర్పించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకోనున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారి కళ్యాణంలో పాల్గొంటారని చెప్పుకొచ్చారు.
అయితే, పురాణల కథనం ప్రకారం.. కాణిపాకం ఆలయానికి సుమారు వెయ్యి ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉంది. అప్పట్లో విహారపురి అనే గ్రామంలో ముగ్గురు వికలాంగ అన్నదమ్ములు నివసించేవారు. వారిలో ఒకరికి చూపు లేదు, మరొకరికి మాట రాదు, ఇంకొకరికి చెవులు వినిపించవు. ధర్మబద్ధంగా జీవిస్తూ.. తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగించేవారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. గ్రామ ప్రజలు తిండి లేక కలవరపడుతుండగా, ఆ అన్నదమ్ములు తమ పొలంలో బావి తవ్వాలని సంకల్పించారు. బావి తవ్వే క్రమంలో, ఒక పెద్ద రాయి ఎదురైంది. దాన్ని పారతో కొట్టిన వెంటనే రక్తం ప్రవహించడం మొదలైంది. ఆ రక్తం ముగ్గురిపైనా పడింది. దాంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తీలుసుకున్న ప్రజలు ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రజలకు గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పటి నుంచే అక్కడ వినాయకుడి పూజలు ప్రారంభమయ్యాయి. అప్పుడు కొబ్బరికాయల నుంచి వచ్చిన నీరు ఒక ఎకరం (కాణి) మేర విరజిమ్మిందని అక్కడి స్థానికులు చెబుతుంటారు. అందుకే ఆ ప్రదేశాన్ని కాణిపారకంగా పిలిచేవారు. అనంతరం కాలక్రమంలో ఆ ప్రదేశం పేరు.. కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ