Share News

CP Radhakrishnan: తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:28 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు.

CP Radhakrishnan: తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
NDA VP Candidate CP Radhakrishnan in Tirumala

తిరుమల, ఆగస్టు 27: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితోపాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి పి.నారాయణతోపాటు బీజేపీ అగ్రనేతలు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు.


భారత్ ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్.. ఆకస్మాత్తుగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణంతోనే తాను ఈ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో ఎన్నికల సంఘం ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను బరిలో దింపారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖరారు చేసింది. ఈ ఉప రాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనుంది. అదే రోజు.. ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా రైళ్లు రద్దు.. అధికారులు ఆకస్మిక నిర్ణయం

కొండ చరియలు విరిగిపడి.. 30 మంది మృతి

For AP News And Telugu News

Updated Date - Aug 27 , 2025 | 01:58 PM