వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు!
ABN, Publish Date - May 10 , 2025 | 05:31 AM
సర్వీస్ కమిషన్ కింద ఎంపికైన మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ (పీసీ) నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆ ఆర్మీ మహిళా అధికారుల ఎస్‌ఎస్‌పీ సర్వీసును ముగించొద్దు
తదుపరి విచారణ వరకు చర్యలు వద్దు
కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మే 9: షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎంపికైన మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ (పీసీ) నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో’ వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దంటూ పరోక్షంగా భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రస్తావించింది. 69 మంది మహిళా అధికారులు వేసిన పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అప్పటి వరకు వారి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎ్‌ససీ) సర్వీసును ముగించి పంపించొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
‘వారు తెలివైన అధికారులు. మీరు వారి సేవలను వేరేచోట వినియోగించుకోవచ్చు. ఇది కోర్టుల చుట్టూ తిరగాల్సిన సమయం కాదు. దేశానికి సేవచేయడానికంటూ వారికి మంచి స్థానం ఉంది’ అని జస్టిస్ కాంత్ పేర్కొన్నారు. కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి వాదనలు వినిపిస్తూ.. ఇది భారత సైన్యానికి యువ అధికారులు అవసరమన్న విధానం ఆధారంగా తీసుకున్న పాలనాపరమైన నిర్ణయమని కోర్టుకు తెలిపారు. షార్ట్ సర్వీస్ కమిషన్ సర్వీసును ముగించి, ఆ మహిళా అధికారులను పంపించడంపై ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 10 , 2025 | 05:31 AM