ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SP MLA Pooja Pal: సీఎం యోగి ఆదిత్యనాథ్‎కు థాంక్స్ చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే

ABN, Publish Date - Aug 14 , 2025 | 01:56 PM

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఎందుకు థాంక్స్ చెప్పారు, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

SP MLA Pooja Pal

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పూజా పాల్ (SP MLA Pooja Pal) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‎(Yogi Adityanath)కు ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా కూడా ఆమె వ్యక్తిగతంగా న్యాయపోరాటానికి సంబంధించి యోగి తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రశంసించారు. పూజా పాల్ భర్త రాజు పాల్, ఒకప్పుడు బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే. ఆయనను 2005లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ మనుషులు బహిరంగంగా కాల్చి చంపారు.

పోరాటం చేసినా కూడా..

అప్పటి నుంచి ఆమెకు న్యాయం దక్కడం చాలా కష్టంగా మారింది. చాలా ఏళ్లుగా పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. కానీ తాజాగా యోగి నిర్ణయం కారణంగా ఆమెకు న్యాయం జరిగింది. పూజా పాల్ ఈ విషయాన్ని యూపీ అసెంబ్లీలో ఇటీవల జరిగిన విజన్ డాక్యుమెంట్ సమయంలో ప్రస్తావించారు. నా భర్తను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు.

అనేక మంది మహిళలకు..

కానీ ఆ హత్య కేసును ఎవరూ పట్టించుకోలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీని గురించి విని న్యాయం చేసినట్లు తెలిపారు. ఇందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. దీంతోపాటు ప్రయాగ్‌రాజ్‌లో నాతోపాటు కలిసి ఉన్నా అనేక మంది బాధిత మహిళలకు కూడా సీఎం న్యాయం చేశారని తెలిపారు. అతీక్అహ్మద్ వంటి గ్యాంగ్‌స్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న విధానం తీసుకొచ్చారని వెల్లడించారు. అందుకే ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారని చెప్పారు.

గ్యాంగ్ స్టర్ నుంచి ఎమ్మెల్యే వరకూ

అతీక్అహ్మద్ పేరు వినగానే చాలా మందికి భయం. రాజకీయ నాయకుడిగా ఎన్నికైనప్పటికీ, ఆయన నేపథ్యం మాత్రం గ్యాంగ్ స్టర్‌. 2004లో రాజు పాల్, అతీక్అహ్మద్ సోదరుడు అష్రఫ్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ క్రమంలోనే 2005లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజు పాల్‌ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అతీక్అహ్మద్.

అతీక్ అహ్మద్

ఏడేళ్ల తర్వాత, 2023లో ఉమేశ్ పాల్ అనే కీలక సాక్షిని కూడా హత్య చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను, మీడియా ప్రతినిధుల ముసుగులో ఉన్న ముగ్గురు వ్యక్తులను బహిరంగంగా కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూజా పాల్ న్యాయాన్ని కోరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది 20 ఏళ్ల న్యాయం కోసం ఒక భార్య చేసిన పోరాటానికి వచ్చిన ముగింపు. ఈ హత్య కేసు సీబీఐకి అప్పగించబడింది. 2024లో సీబీఐ కోర్టు ఏడుగురిని శిక్షించింది. రాజు పాల్ హత్య కేసులో రంజిత్ పాల్, ఫర్హాన్, జావేద్, గుల్హసన్ తదితరులు దోషులుగా తేలారు.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండ

Updated Date - Aug 14 , 2025 | 01:58 PM