ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:34 AM

Encounter: జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనికులు, స్థానిక పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని ఉగ్రవాదులు గమనించారు. దీంతో వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో సైనికులు వెంటనే స్పందించి.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్ మరణించారు.

శ్రీనగర్, ఏప్రిల్ 24: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఆ క్రమంలో ఉదంపూర్‌ జిల్లా బసంత్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు.ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకొన్నారంటూ నిఘా వర్గాలు సమాచారం మేరకు దూదు-బసంత్‌గఢ్ ప్రాంతాంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.

ఈ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టారు. దీంతో తనిఖీలు నిర్వహిస్తున్న వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో ఇరువైపులా భారీగా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జవాన్ తీవ్రంగా గాయపడ్డారని.. అతడికి చికిత్స కోసం ఆసుప్రతికి తరలించామని చెప్పారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారని ఆర్మీ అధికారులు వివరించారు. ఎక్స్ ఖాతా వేదికగా వారు ఆర్మీ అధికారులు తెలిపారు.


ఏప్రిల్ 22వ తేదీ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పుల్లో 26 మంది మరణించారు. దీంతో కేంద్రం ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అందులోభాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం దాదాపు 3 గంటల పాటు సమావేశమైంది. ఆ క్రమంలో పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.


సింధు నదీ జలాలను నిలిపివేసింది. అలాగే అట్టారీ - వాఘా సరిహద్దును మూసి వేసింది. ఇక న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తను పిలిపించి.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు వారికి వారం రోజుల గడువు విధించింది. మరోవైపు పాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కి రావాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి వేళ.. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు

Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

For National news And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 12:31 PM