ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - May 31 , 2025 | 01:59 PM

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 20 లక్షల మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ ఆపరేషన్ సిందూర్, మహిళల గురించి ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశారు.

PM Modi Bhopal speech

భోపాల్‌: సింధూరం సంప్రదాయకంగా వివాహ బంధానికి చిహ్నమైనప్పటికీ, ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి చిహ్నంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‎ను ఉదహరిస్తూ ఇది భారతీయ మహిళల ధైర్యం, శక్తి, సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో శనివారం నిర్వహించిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.


పేదలకు సాయం..

దేవుని ఆరాధన, ప్రజల సేవకు దేవి అహల్యాబాయి ఎలాంటి భేదం చూపలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆమె పేదల జీవితాల్లో పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. కాశీలో సేవ చేసే అవకాశం నాకు లభించడం సంతోషకరమన్నారు. అక్కడే అహల్యాబాయి అభివృద్ధి పనులకు మొదట పునాది వేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆమె మహిళలను చేనేత రంగంలో శక్తివంతం చేశారని, నీటి సంరక్షణతో రైతులు ఎక్కువ ఆదాయం పొందేలా సహాయపడ్డారని వెల్లడించారు. స్త్రీలకు కూడా ఆస్తి హక్కులు ఉండాలని, భర్తలు అకాల మరణం చెందినా తిరిగి వివాహం చేసుకోవచ్చని అహల్యా ఆ కాలంలో చెప్పారని మోదీ అన్నారు.


అనేక కుటుంబాలకు

అహల్యాబాయి గిరిజన సమూహాల కోసం కూడా కృషి చేశారని, వారికి వ్యవసాయ భూములు కేటాయించి అభివృద్ధికి తోడ్పడ్డారని ప్రధాని అన్నారు. జూనాగఢ్ నుంచి కుటుంబాలను మహేశ్వర్‌కు తీసుకొచ్చి, మహేశ్వరీ చీరల తయారీలో నైపుణ్యం నేర్పించారన్నారు. ఇది ఇప్పటికీ అనేక కుటుంబాలకు ఆదాయ వనరుగా ఉందని మోదీ తెలిపారు. అహల్యాబాయి అభివృద్ధి, పురోగతికి చిహ్నమని.. ప్రజలు ఇచ్చిందే మనకు సొంతమని ఆమె చెప్పారని మోదీ ప్రస్తావించారు.


మహిళల కోసం..

ప్రస్తుత ప్రభుత్వం నీటి సరఫరా, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సరఫరా, వైద్య సంక్షేమ పథకాల ద్వారా సమాజ పురోగతి కోసం కృషి చేస్తోందన్నారు మోదీ. గతంలో మహిళలు తమ అనారోగ్యాలను దాచుకునేవారు. తమ కుటుంబంపై భారం కాకూడదని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఐదు లక్షల రూపాయల వరకూ వైద్య సహాయం పొందుతున్నారని మోదీ చెప్పారు. మూడు కోట్ల మహిళలను లఖ్‌పతి దీదీలుగా చేస్తామని మేము వాగ్దానం చేశాం.

ఇప్పుడు వేలాది మంది మహిళలు స్వయం సహాయక బృందాలతో అనుసంధానమై ఉన్నారు. భారతదేశం గొప్ప సంస్కృతి కలిగిన దేశం. మన సంప్రదాయంలో సింధూరం నారీ శక్తికి చిహ్నం. శ్రీరాముడిని ఆరాధించడానికి హనుమంతుడు కూడా సింధూరం ఉపయోగించాడని ప్రధాని మోదీ ప్రస్తావించారు.


ఇవీ చదవండి:

మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు


ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 02:11 PM