Shubhanshu Shukla: అంతరిక్షంలోకి మరో భారతీయుడు.. ఇతనెవరో తెలుసా
ABN, Publish Date - Jun 25 , 2025 | 08:49 AM
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగామలు అంతరిక్ష యాత్ర చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ యాత్రలో శభాంశు.. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 25: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం మిషన్‌లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. అంతరిక్ష యాత్రకు వెళ్తున్న రెండో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్షా. ఇప్పటికే 1984లో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్రకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 1969లో ఇదే కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టారు. భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల అనంతరం శుభాంశు శుక్లా ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు పైలెట్‌గా శుభాంశు శుక్లాను ఇస్రో ఎంపిక చేసిన విషయం విదితమే.
ఈ రోదసి యాత్ర నేపథ్యంలో అర్యోగం కోసం వీరిని దాదాపు నెలకుపైగా క్వారంటైన్‌లో ఉంచారు. 15 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా నలుగురు సభ్యులు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఆ జాబితాలో ఏడింటిని భారత శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అలాగే ఈ యాత్రలో భాగంగా అంతరిక్షం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో శుభాంశు శుక్లా ముచ్చటించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏడుగురు సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మాములుగా ఈ యాక్సియం మిషన్ 4.. అంతరిక్ష యాత్ర తొలుత మే 29వ తేదీన జరగాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల పలుమార్లు ఈ యాత్ర వాయిదా పడుతూ వస్తోంది. చివరకు జూన్ 25వ తేదీన ఈ యాత్రను ఖరారు చేశారు.
హ్యూస్టన్‌కు చెందిన యాక్సియం స్పేస్.. నాసా భాగస్వామ్యంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఇండో - యూఎస్ యాక్సింయా మిషన్ 4ను నిర్వహిస్తామని 2023లో అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశంతో ప్రధాని మోదీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది భారత్, అమెరికా అంతరిక్ష సహకారానికి నూతన అధ్యాయమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘ఉచిత ప్రయాణం’ కోసం 2 వేల బస్సులు కొనాలి
జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..
For National News And Telugu News
Updated Date - Jun 25 , 2025 | 09:30 AM