ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SJaishankar: కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు

ABN, Publish Date - May 15 , 2025 | 05:18 PM

ఇండియా, పాకిస్థాన్ మధ్య పరిస్థితుల గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఇదే సమయంలో అమెరికాకు కూడా కీలక సూచన చేశారు. అయితే ఏమన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

S Jaishankar

ఢిల్లీ: కశ్మీర్ సమస్యపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని, ఇది భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు. పాకిస్థాన్ సైన్యాన్ని కాకుండా, ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, పాకిస్థాన్ ఈ సలహాను పట్టించుకోలేదన్నారు. భారతదేశంపై చేసిన దాడికి మా సైన్యం గట్టి ప్రతీకారం తీర్చుకుందన్నారు.


దోషులకు శిక్ష..

శాటిలైట్ చిత్రాలు ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు జరిగిన భారీ నష్టాన్ని, భారతదేశానికి అతి తక్కువ నష్టాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని జైశంకర్ గుర్తు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత TRF (తీవ్రవాద రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థను నిషేధించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ డిమాండ్ చేసింది. ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆధారాలను సమర్పించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. జైశంకర్ ఈ విషయంపై మాట్లాడుతూ పహల్గామ్ దాడిలో దోషులకు కఠిన శిక్ష విధించాలని ఐక్యరాజ్య సమితి సభ్యులు స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌కు అంతర్జాతీయ మద్దతు లభిస్తోందన్నారు.


సింధు జలాల ఒప్పందం..

భారత్ దాడి తర్వాత పాకిస్థాన్ కూడా చైనా డ్రోన్‌లను ఉపయోగించినట్లు జైశంకర్ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఈ దాడిని చూసిందని, ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మంచి మద్దతు లభిస్తుందన్నారు జై శంకర్. పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయంపై మాట్లాడుతూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిలిపివేసే వరకూ ఈ ఒప్పందం నిలిపివేయబడుతుందన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌పై చర్చించాల్సిన ఒకే ఒక అంశం ఉందన్నారు. అది పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడం. దీని గురించి చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు.


Also Read:

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

చైనాకు బుద్ధి చెప్పిన భారత్

గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 15 , 2025 | 05:47 PM