Share News

AP liquor Scam: గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ABN , Publish Date - May 14 , 2025 | 01:55 PM

AP liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాల మేరకు వీరందరూ కూడా పాత్రధారులు, సూత్రధారులుగా వ్యవహరించారని మొదటి నుంచి సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే గోవిందప్పను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపర్చారు.

AP liquor Scam: గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
AP liquor scam Govindappa Balaji

విజయవాడ, మే 14: ఏపీ లిక్కర్ కేసులో (AP Liquor Case) గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారు. మద్యం ఆర్థర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించాడని రిపోర్టులో పేర్కొన్నారు. డిస్టలరీస్ నుంచి ముడుపులు వసూలు చేసే వ్యవస్థలో కీలకంగా వ్యవరించారని తెలిపారు. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను సిద్ధం చేశారని.. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.


కాగా.. లిక్కర్‌ స్కాంలో గోవిందప్ప బాలాజీని నిన్న (మంగళవారం) మైసూర్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో విచారించిన అనంతరం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపర్చారు. ఈ కేసులో ఏ33గా బాలాజీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. ప్రధానంగా రాజ్‌కసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని.. కసిరెడ్డి ఆదేశాల మేరకు గోవిందప్పకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప బాధ్యతలను పూర్తి తీసుకుని మద్యానికి సంబంధించి డిస్టలరీ కంపెనీల మార్పులు, కొత్తవారికి ఏ విధంగా డిస్టలరీ కంపెనీలు ఇవ్వాలి, వారి నుంచి ఏ విధంగా ముడుపులు తీసుకోవాలని, నెలవారి మామూళ్లు ఎవరెవరికి, ఏయే మార్గాల్లో అందజేయాలనే అంశాల్లో కూడా గోవిందప్ప పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే దాదాపు మూడు రోజుల పాటు గాలించి మరీ నిన్న (మే 13) మైసూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (బుధవారం) ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చారు.


అలాగే రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాల మేరకు వీరందరూ కూడా పాత్రధారులు, సూత్రధారులుగా వ్యవహరించారని మొదటి నుంచి సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే గోవిందప్పను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపర్చారు. గతంలో దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న బ్రాండ్‌లు మాత్రమే అమలులో ఉండేవి. అయితే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అటువంటి డిమాండ్‌లు ఉన్న బ్రాండ్లను పూర్తిగా నిలిపివేసి సొంత తయారీతో, సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మద్యం తయారీకి సంబంధించి వైసీపీ నాయకులను బ్రాండ్లకు సంబంధించిన తయారీ కేంద్రాలకు యజమానులుగా మార్చిన వైనం తేటతెల్లమైంది. అంతేకాకుండా ఏయే కంపెనీలకు ఎంత వరకు అనుమతులు ఇవ్వాలి, నెలవారీగా ఒక కంపెనీకి ఒక నెలలో ఎక్కువగా ఇస్తే... మరో కంపెనీకి మరోనెలలో ఎక్కువగా తయారు చేసే అవకాశం ఇస్తూ తద్వారా అధికంగా ముడుపులు తీసుకోవడంతో పాటు వాటిని వివిధ రూపాల్లో తాడేపల్లి ప్యాలెస్, ముఖ్య నాయకులకు చేరినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఏపీ లిక్కర్ స్కాంలో కొన్ని వేల కోట్లు చేతులు మారినట్లు తేల్చారు. రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. వాదనలు ముగిసిన తర్వాత గోవిందప్ప బాలాజీకి రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్.. గోవిందప్పను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

DD Next Level Movie: డీడీ నెక్ట్స్‌ లెవల్ హీరో, నిర్మాతకు లీగల్ నోటీసులు

Adampur Airbase: అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2025 | 02:16 PM