ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

S Jaishankar: పట్టపగలు బహిరంగంగా తిరుగుతున్న ఉగ్రవాదులు

ABN, Publish Date - May 23 , 2025 | 11:08 AM

ఉగ్రవాదంపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు. పాకిస్థాన్ మాటల్లో నిజం లేదన్నారు.

MEA Minister Jaishankar

న్యూఢిల్లీ, మే 23: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ తమకేమీ తెలియదన్నట్లు నటిస్తున్న పాకిస్థాన్‌పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మండిపడ్డారు. తమ నేలపై ఉగ్రవాదం లేదంటూ పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనను ఆయన ఖండించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్థాన్‌ ప్రభుత్వంతోపాటు ఆ దేశ సైన్యం కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యూరప్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా నెదర్లాండ్స్‌లో మంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జాబితాలోని ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌లోనే ఉన్నారన్నారు. వారంతా పెద్దపెద్ద నగరాల్లో నివసిస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచే వారు ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వారి చిరునామాలే కాదు.. ఎవరెవరితో వారు సంబంధాలు నెరుపుతున్నారో కూడా పాక్ ప్రభుత్వానికి తెలుసని వెల్లడించారు. అంతేకాదు వారంతా పట్టపగలు పాకిస్థాన్‌లో బహిరంగంగా తిరుగుతున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ వైఖరిని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో భారత్ ఒక ఖచ్చితమైన ముగింపును మాత్రం కోరుకుంటుందన్నారు. తమకు పాకిస్థాన్‌పై ఆగ్రహం లేదని.. కానీ ఉగ్రవాదంపై ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో లెక్కలేనన్ని ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాంటి పాకిస్థాన్.. తమ దేశానికి ఉగ్రవాదంతో ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం ఇదే రీతిగా కొనసాగితే.. ఆ తర్వాత భారత్ నుంచి ఎదురయ్యే పరిణామాలను ఆ దేశం తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జై శంకర్ హెచ్చరించారు.


అలాగే భారత్‌కు ఉగ్రవాదం, జమ్మూకాశ్మీర్ అంశాలు వేర్వేరని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అనేది స్వతంత్రమైనది. అదే విధంగా పూర్తిగా ఆమోదయోగ్యం కాని అంతర్జాతీయ నేరమన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక రంగాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు భారత్, పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై సైతం మంత్రి జై శంకర్ స్పందించారు. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ తోసిపుచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాశ్మీర్ అంశంలో మూడో ప్రమేయాన్ని తాము అంగీకరించబోమని మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్

బంగ్లాదేశ్‌లో మళ్లీ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా..!

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 02:42 PM