Tiruchi Siva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివకు ఛాన్స్
ABN, Publish Date - Aug 18 , 2025 | 03:38 PM
తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని 'ఇండియా' కూటమి భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక వేడెక్కుతోంది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించడంతో విపక్ష 'ఇండియా' కూటమి సైతం తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ (Tiruchi Shiva)ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 'ఇండియా' కూటమి ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని 'ఇండియా' కూటమి భావిస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా, ఈనెల 21వ తేదీతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో కూటమి ఫ్లోర్ లీడర్లు సోమవారం నాడు సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థిని ఈరోజే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇండియా కూటమి నేడు కీలక నిర్ణయం.. ఉపరాష్ట్రపతి రేస్‌లో ఎవరు ముందున్నారు?
ప్రజలకు ప్రయోజనకరంగా ప్రవర్తించండి.. ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 18 , 2025 | 07:37 PM