Home » Rajya Sabha
విదేశాల్లో ఉంటున్న భారతీయులపై దాడులు గత ఐదేళ్లల్లో 7 రేట్లు పెరిగాయని విదేశాంగ శాఖ రాజ్యసభలో వెల్లడించింది.
కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చే ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. కేరళ పేరు మార్పు బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ బిల్లు ఆమోదం పొందింది.
రాజ్యసభలో లుంగీవాలా వ్యాఖ్యలు కలకలానికి దారి తీశాయి. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనను లుంగీవాలా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సీపీఐ (ఎమ్) ఎంపీ జాన్ బ్రిటాస్ ఆరోపించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో కేరళ పేరు మార్పు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, గనులు, ఖనిజాల చట్ట సవరణ తదితర బిల్లులున్నాయి.
సీడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీడబ్ల్యూసీ స్పష్టత, అంతర్రాష్ట్ర అనుమతులు పొందిన తర్వాత కొత్త ప్రతిపాదన పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.
పార్లమెంట్, రాజ్యసభలో ప్రతిపాదించిన 'సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (సవరణ) బిల్లు - 2026'కు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ చింతకాయల విజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచడం సకాలంలో తీసుకున్న అభినందనీయమైన నిర్ణయమని పేర్కొన్నారు.
రాజ్యసభలో ఏపీ మెగా డీఎస్సీ అంశాన్ని ప్రస్తావించి రభస చేయడానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. గురువారం రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరగగా వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు.. నేడు రాజ్యసభకు రానుంది. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశముంది.
రాజ్యసభలో దేశభక్తి, ‘వందేమాతరం’ విశిష్టతపై టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రాజ్యసభ సమావేశాలలో భాగంగా ‘నేషనల్ ఆనర్ అమెండ్‌మెంట్ బిల్లు’పై విజయ్ ప్రసంగించారు.
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ అంశం రాజ్యసభలో దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, విపక్షాల ఆరోపణల్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొట్టపారేశారు.