Share News

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై సుమోటో ప్రకటన‌కు కేంద్రం హామీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:50 PM

వ్యవసాయ రంగం, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసే అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో మంగళవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ వివరాలు వెల్లడించాలని నినాదాలు చేశారు. దీంతో సుమోటో ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమేనని నడ్డా సమాధానం ఇచ్చారు.

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై సుమోటో ప్రకటన‌కు కేంద్రం హామీ
JP Nadda

న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌పై కేంద్రం సుమోటో ప్రకటన చేస్తుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) హామీ ఇచ్చారు. దీనిపై సభలో చర్చకూ తాము సిద్ధమేనని తెలిపారు. వ్యవసాయ రంగం గురించి, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసే అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో మంగళవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ వివరాలు వెల్లడించాలని నినాదాలు చేశారు. దీంతో సుమోటా ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమేనని నడ్డా సమాధానం ఇచ్చారు.


'సుంకాలపై అమెరికా అధ్యక్షుడు సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోదీని తన నిజమైన మిత్రుడిగా పేర్కొన్నారు. ఆ తర్వాత ట్రేడ్‌ డీల్‌పై అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెబుతూ మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్రేడ్ డీల్‌పై ప్రభుత్వం సుమోటో ప్రకటన చేస్తుంది. దానిపై చర్చ కూడా జరుపుతుంది' అని నడ్డా తెలిపారు. సమగ్రమైన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇండి కూటమి వైఖరి బాగోలేదని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యాన్ని బెదిరించేలా వారి వైఖరి ఉందని, కాంగ్రెస్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. వారి మాటల్లో అసహనం కనిపిస్తోందని విమర్శించారు.


కౌగిలింతల దౌత్యం: జైరామ్ రమేష్

దీనికి ముందు కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌తో రైతులను ప్రభుత్వం వంచించిందని ఆరోపించారు. దీనిపై రాజ్యసభలో తమ నేతలు నిరసన తెలియజేస్తారని చెప్పారు. జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యాన్ని 'కౌగిలింతల దౌత్యం'గా అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య ఘర్షణను నిలిపివేసినట్టు పదేపదే ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడికి మోదీ పూర్తిగా లొంగిపోయారని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ

అలా అయితే ఈ దేశం నుంచి వెళ్లిపోండి.. మెటా ప్రతినిధులకు సుప్రీంకోర్టు వార్నింగ్..

Updated Date - Feb 03 , 2026 | 03:07 PM