Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్
ABN, Publish Date - May 14 , 2025 | 03:03 PM
మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతం కావడం, కాల్పుల విరమణకు భారత్-పాక్ మధ్య అంగీకారం కుదిరిన క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌బేస్ (Bhuj Airbase)ను సందర్శించనున్నారు. ఈనెల 16న ఆయన భుజ్‌కు వెళ్తారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కూడా పర్యటిస్తారు. పాకిస్తాన్ ఇటీవల డ్రోన్ దాడులకు విఫలయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో భారత సాయుధ బలగాల సన్నద్ధతను, భద్రతా పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలను రక్షణ మంత్రి సమీక్షించనున్నారు.
Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ
మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. భారత మిలటరీ చావుదెబ్బ కొట్టడంతో వెనక్కి తగ్గిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. భుజ్‌లోని రుద్ర మాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ భారత వాయుసేనకు కీలకంగా ఉంది. ఇక్కడ సివిలియన్ భుజ్ ఎయిర్‌పోర్ట్‌తో రన్‌వేను వాయిసేన పంచుకుంటోంది.
ఆదంపూర్‌లో పర్యటించిన మోదీ
దీనికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను మంగళవారంనాడు సందర్శించారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న జవాన్లను కలుసుకున్నారు. జవాన్ల ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 14 , 2025 | 03:04 PM