ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Defence Minister: త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ భేటీ

ABN, Publish Date - May 10 , 2025 | 05:41 AM

పాక్‌ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం పాకిస్థాన్‌ దాడులను తిరస్కరించిన వేళ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనిక అధికారి లతో భద్రతా సమీక్ష నిర్వహించారు. మరోవైపు, హోంమంత్రి అమిత్‌ షా కీలక సంస్థల భద్రతా చర్యలను సమీక్షించారు.

న్యూఢిల్లీ, మే 9: సరిహద్దు రాష్ట్రాల్లో గురువారం రాత్రి పాకిస్థాన్‌ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన వేళ.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు. సీడీఎస్‌ అనిల్‌చౌహాన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి హాజరు కాగా.. దేశ భద్రతపై రాజ్‌నాథ్‌ సమీక్షించారు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేయడం, తదుపరి చర్యలకు ప్రణాళిక రూపొందించడంపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాజ్‌నాథ్‌ శుక్రవారం పట్నాలో పర్యటించాల్సి ఉండగా.. రద్దు చేసుకుని ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోభాల్‌, బీఎ్‌సఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌ డైరెక్టర్‌ జనరళ్లు, హోంశాఖ అధికారులతో తన నివాసంలో సమావేశమయ్యారు. దేశంలోని అన్ని కీలకమైన సంస్థలు, విమానాశ్రయాలు, విద్యుత్తు ప్లాంట్లు, పరిశోధన సంస్థల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 05:42 AM