Rahul Gandhi: బుల్లెట్ గాయానికి బ్యాండ్ఎయిడ్.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విసుర్లు
ABN, Publish Date - Feb 01 , 2025 | 05:42 PM
అనిశ్చితి పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో దేశ ఆర్థిక సంక్షోభంపై బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ దివాళాకోరుతనాన్ని చాటుతోందన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)పై లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ (Band Aid) చికిత్సలా బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో దేశ ఆర్థిక సంక్షోభంపై బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచనా లేమిని చాటుతోందన్నారు.
PM Modi: దేశ అభివృద్ధి జర్నీలో మైలురాయి.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల బడ్జెట్
కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగు సంక్షోభాలతో కునారిల్లుతోందని, ఈ జబ్బులను పరిష్కరించడానికి బడ్జెట్‌లో చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. స్థిరమైన వాస్తవ వేతనాలు, వినియోగదారుల ఇబ్బందులు, ప్రైవేటు పెట్టుబడుల మందగమన రేట్లు, సంక్లిష్టమైన జీఎస్‌టీ వ్యవస్థ వంటి జబ్బులను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు బడ్జెట్‌లో లేవని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జైరామ్ రమేష్ విమర్శించారు. ఎన్డీయే భాగస్వామి నితీష్ కుమార్ పాలనలో ఉన్న బీహార్‌కు బెనంజా ప్రకటించి, మరో భాగస్వామ్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేసిందని కూడా ఆరోపించారు. కేవలం ఆదాయం పన్ను చెల్లింపుదారులకు మాత్రమే బడ్జెట్‌లో ఉపశమనం ఉందని, అయితే ఇది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలని అన్నారు.
ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు..
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎదుగమతులు అభివృద్ధికి నాలుగు పవర్ ఇంజన్లని అభివర్ణించడంపై జైరామ్ రమేష్ మాట్లాడుతూ, ఇన్నిరకాల ఇంజన్లతో బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పిందన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ కంపెనీలు కోరుకున్న సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010కి బీజేపీ సారథ్యంలో అరుణ్ జైట్లీ విజయవంతంగా తూట్లు పొడిచారని, ఇప్పుడు ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)ను ప్రసన్నం చేసుకునేందుకు ఆ చట్టాన్ని సవరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారని తెలిపారు.
Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే
Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..
Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 05:43 PM