PM Modi: దేశ అభివృద్ధి జర్నీలో మైలురాయి.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల బడ్జెట్
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:27 PM
దేశ అభివృద్ధి జర్నీలో ఇదొక మైలురాయి అని, 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కార్ కేంద్రంలో వరుసగా మూడోసారి ఆధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. దేశ అభివృద్ధి జర్నీలో ఇదొక మైలురాయి అని, 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. అన్నిరంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తు్న్నామని, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని, వికసిత్ భారత్ వైపు బడ్జెట్ అడుగులు వేయిస్తుందని చెప్పారు.
Budget 2025: విజనరీ బడ్జెట్.. నిర్మలమ్మపై కేంద్ర మంత్రులు, సీఎంల ప్రశంస
ఆదాయం పన్ను పరిమితిని రూ.12 లక్షలకు బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ పెంచడంపై మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ప్రజల సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించిందని అన్నారు. రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్నూ లేదని, అన్ని ఆదాయ వర్గాలకు పన్నులు తగ్గించారని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సేవింగ్స్, పెట్టుబడులు, వినియోగం పెరగడంతో పాటు శీఘ్ర వృద్ధి సాధ్యమని అన్నారు. ఇలాంటి జనతా జనార్థన్, పీపుల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, ఆమె టీమ్ మొత్తానికి తాను అభినందనలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు.
సహజంగా బడ్జెట్ అన్నప్పుడు ఖాజానా నింపేందుకు దృష్టి సారిస్తారని, ఈ బడ్జెట్ మాత్రం ప్రజల సేవింగ్, జేబులు నింపే బడ్జెట్ అని అన్నారు. సంస్కరణల పరంగా కీలకమైన చర్యలు ఈ బడ్జెట్‌లో తీసుకున్నామని అన్నారు. న్యూక్లియర్ ఇంధనరంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం చరిత్రాత్మకమని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉపాధి అవకాశాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. షిప్ బిల్డింగ్‌కు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రోత్సాహం కల్పించడం వల్ల ఆత్మనిర్బర్ భారత్ మరింత ఊపందుకోనుందని, షిప్ బిల్డింగ్ రంగంలో గరిష్ట ఉపాధి లభిస్తుందని చెప్పారు. పర్యటక రంగం అభివృద్ధికి కూడా దేశంలో ఎన్నో అవకాశాలున్నాయని, 50 టూరిస్టు స్టేషన్లలో హోటళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో హోటళ్లను తీసుకురావడం వల్ల టూరిజం సెక్టార్‌కు మంచి ఊపందుకుంటుదని చెప్పారు. ఉపాధికి కూడా గణనీయంగా అవకాశాలుంటాయని తెలిపారు.
Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే
Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..
Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి