ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Prashant Kishore: జన్‌సురాజ్ పార్టీ తొలి అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

ABN, Publish Date - May 19 , 2025 | 06:34 PM

ప్రశాంత్ కిషోర్ గత ఏడాది అక్టోబర్ 2న 'సున్ సురాజ్' పార్టీని ప్రారంభించారు. పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే పార్టీని ప్రారంభించిన ఆయన... పార్టీలో తాను ఎలాంటి పదవుల్లోనూ ఉండటం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు.

పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్ (Prashant Kishore) తమ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిని సోమవారంనాడు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ (Uday Singh)ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పూర్తి స్థాయిలో జన్ సురాజ్ పార్టీ అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక నియామకం చేశారు. పూర్నియాకు రెండు సార్లు ఎంపీగా పని చేసిన ఉదయ్ సింగ్ 2019లో బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పప్పూ యాదవ్‌కు సపోర్ట్ చేశారు.

Supreme Court: ఈ దేశం ధర్మశాల కాదు.. శ్రీలంక పౌరుని పిటిషన్‌‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..


ప్రశాంత్ కిషోర్ గత ఏడాది అక్టోబర్ 2న 'సున్ సురాజ్' పార్టీని ప్రారంభించారు. పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే పార్టీని ప్రారంభించిన ఆయన... పార్టీలో తాను ఎలాంటి పదవుల్లోనూ ఉండటం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు.


కాగా, జన్‌సురాజ్ పార్టీ గత ఏడాది బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్కటీ గెలుచుకులేకపోయింది. డిపాజిట్ సైతం కోల్పోయింది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇమామ్‌గంజ్ నియోజకవర్గాన్ని తిరిగి నిలబెట్టుకోగా, తరారి, రామ్‌గఢ్, బెలగంజ్ నియోజకవర్గాలను ఇండియా కూటమి నుంచి తమ ఖాతాలోకి వేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 06:37 PM