ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun Kharge: ప్రచారం కాదు, శత్రువుపై దృష్టిపెట్టండి.. మోదీకి ఖర్గే సలహా

ABN, Publish Date - Jun 01 , 2025 | 09:54 PM

సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామంటూ గతంలో చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు అంతా తానే చేశానని చెప్పుకోవడం ఏమిటిని ఖర్గే ప్రశ్నించారు. సొంత గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదన్నారు.

బెంగళూరు: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో చేస్తున్న ప్రసంగాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాలకు ప్రధాని దూరంగా ఉంటూ శత్రువుపై దృష్టిసారించాలని సూచించారు.


బెంగళూరులో ఆదివారంనాడు మీడియాతో ఖర్గే మాట్లాడుతూ, ఆయన (మోదీ) ఇచ్చే ప్రతి ప్రకటనకు తాను స్పందించాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే ఇటీవల ఆయన ఇస్తున్న బహిరంగ ప్రకటనలు, రాజకీయాల కార్యకాలాపాలను దృష్టిలో ఉంచుకుని తాను ఒక సూచన చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతానికి కొంతకాలం ఆయన ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటూ దేశంపై దృష్టి సారించాలని అన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామంటూ గతంలో చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు అంతా తానే చేశానని చెప్పుకోవడం ఏమిటిని ప్రశ్నించారు. సొంత గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదన్నారు. దానికి బదులుగా శత్రువుపై దృష్టి సారించాలని సూచించారు. సాయుధ బలగాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఖర్గే చెప్పారు.


ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన తాజా పరిణామాలపై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రతినిధి బృందం కన్సల్టేషన్స్ కోసం విదేశాలకు వెళ్లిందని చెప్పారు. వాళ్లు వచ్చేంత వరకూ ఆ వివరాలు మాట్లాడటం సరికాదని అన్నారు.


ఇవి కూడా చదవండి..

దేవుడు కంటే మీరే ఎక్కువ.. లూలూ, రబ్రీకి తేజ్ ప్రతాప్ ఎమోషనల్ పోస్ట్

అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్.. పోటీ ఎక్కడినుంచంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 09:55 PM