PM Modi: వచ్చే నెలలో చైనాకు ప్రధాని మోదీ
ABN, Publish Date - Jul 17 , 2025 | 06:15 AM
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ, జూలై 16: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 వరకు జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపే అవకాశం ఉంది. వీరిద్దరూ గతేడాది అక్టోబరులో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలు మోదీ పర్యటనతో మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో సైనిక ఘర్షణల తర్వాత మోదీ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి కానుంది.
Updated Date - Jul 17 , 2025 | 06:15 AM