ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Atal Bihari Vajpayee : అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల పుష్పాంజలి

ABN, Publish Date - Aug 16 , 2025 | 09:37 AM

భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్తూ ఇవాళ అంజలి ఘటిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

Atal Bihari Vajpayee Death Anniversary

న్యూఢిల్లీ, ఆగస్టు 16 : భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్తూ ఇవాళ అంజలి ఘటిస్తోంది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం (శనివారం) 'సదైవ్ అటల్' (స్మారక చిహ్నం) సమాధి వద్ద మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా Xలో చేసిన ఒక పోస్ట్‌లో మోదీ.. భారతదేశ పురోగతి పట్ల వాజ్‌పేయి నిబద్ధత.. అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన దేశాన్ని నిర్మించే ప్రయత్నాలను కీర్తించారు. . 'అటల్ జీని తన పుణ్య తిథి సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాను. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకితభావం, సేవా స్ఫూర్తి.. భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తూనే ఉన్నాయి' అన్నారు.

ఇంకా, కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరెన్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, జెడి(యు) ఎంపీ సంజయ్ ఝా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా 'సదైవ్ అటల్'ను సందర్శించి నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి వాజ్‌పేయి జీవితాంతం చేసిన కృషిని రాజ్ నాథ్ సింగ్ తన ఎక్స్ సందేశంలో గుర్తు చేసుకున్నారు. 'అటల్‌జీ పుణ్యతిథి సందర్భంగా నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను. బలమైన సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం పనిచేశారు. దేశం ఎల్లప్పుడూ ఆయన చేసిన అద్భుతమైన సహకారాన్ని గుర్తుంచుకుంటుంది' అని రాజ్‌నాథ్ సింగ్ Xలో పోస్ట్ చేశారు.

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్థంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అటల్ దేశానికి చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. అటు, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా అటల్ జీకి అంజలి ఘటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 10:11 AM