ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:56 AM

Pahalgam Terror Attack: పహల్గాం దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం పలు భేటీలు జరిగాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించింది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మరోసారి భేటీ అయింది. ఈ భేటీ అనంతరం కేబినెట్ కమిటీ ఆన్ పోలిటికల్ అఫైర్స్ సమావేశం జరగనుంది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక కమిటీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ కమిటీ ఆన్ పోలిటికల్ అఫైర్స్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశమైంది. మరోవైపు 2019లో పుల్వామా దాడి అనంతరం ఈ కమిటీ సమావేశమైంది.

ఈ సందర్భంగా గతంలో పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశ హోదాను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బాలాకోట్‌లో ఉగ్రవాద మూకల స్థావరాలపై దాడి చేయాలని సైతం నిర్ణయం తీసుకొంది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ కేబినెట్ కమిటీ ఆన్ పోలిటికల్ అఫైర్స్ సమావేశం అయింది.


ఈ సమావేశానికి ముందు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనే అవకాశముందని తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తేదీ ఈ ఉగ్రదాడి జరిగిన అనంతరం తొలిసారి ఈ కమిటీ సమావేశమై.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.


పాక్‌తో జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీలు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే న్యూఢిల్లీలోని పాక్‌ రాయబారిని సైతం స్వదేశానికి వెళ్లాలంటూ సూచించింది. అందుకు వారికి గడువును సైతం విధించింది. అయితే తాజాగా జరుగుతోన్న ఆ సమావేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌ను అన్ని వైపుల నుంచి కట్టడి చేయడం ద్వారా ఏకాకిని చేసేందుకు ఎన్ని ప్రయాత్నాలు ఉన్నాయో వాటన్నింటిని అమలు చేయాలనే తలంపుతో మోదీ ప్రభుత్వం ఉన్నట్లు ఓ చర్చ అయితే సాగినట్లు తెలుస్తోంది. భారత సైన్యానికి ప్రధాని మోదీ ఇప్పటికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సమావేశాల అనంతరం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశం సైతం ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనుంది.


ఇప్పటికే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సైతం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ఈ ఉగ్రదాడిని ఖండించింది. అంతేకాకుండా.. తమ రాష్ట్రానికి వచ్చిన అతిథులను క్షేమంగా తిరిగి పంపడడంలో తాను విఫలమయ్యానంటూ సీఎం ఓమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేసిన విషయం విధితమే. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ సమాశంలో నిర్ణయం తీసుకొన్నారు.

ఇవి చదవండి..

India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..

Actor Jethwani Case: ఇద్దరు ఐపీఎస్‌లకు సీఐడీ నోటీసులు..

Pahalgam Terror Attack: ఆ పాకిస్థానీ ఫ్యామిలీకి బిగ్ రిలీఫ్

Pahalgam Terror Attack: ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్

Fire Accident: అగ్నిప్రమాదం 14 మంది సజీవ దహనం

For National News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 01:07 PM