Fire Accident: అగ్నిప్రమాదం 14 మంది సజీవ దహనం
ABN , Publish Date - Apr 30 , 2025 | 07:30 AM
Fire Accident: హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
కోల్‌కతా, ఏప్రిల్ 30: సెంట్రల్ కోల్‌కతాలోని రితురాజ్ హోటల్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారని.. పలువురు తీవ్రంగా గాయపడ్డారని నగర పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ వెల్లడించారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారన్నారు.
అలాగే సహాయక చర్యలు సైతం వారు చేపట్టారని వివరించారు. హోటల్‌లో చిక్కుకున్న పలువురిని వారు రక్షించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. అందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు సుకాంత్ ముజుందారు సైతం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ స్పందించారు. కోల్‌కతా నగర కార్పొరేషన్ యంత్రాంగంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విషాదకర సంఘటన అని ఆయన పేర్కొన్నారు. చాలా మంది ప్రజలు ఈ హోటల్‌లో చిక్కుకొన్నారన్నారు. వారికి రక్షణ లేదు. భద్రతా లేదంటూ మండిపడ్డారు. అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో తనకు అర్థం కావడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇవి చదవండి..
Pakistan: భారత 'గూఢచారి డ్రోన్'ను కూల్చేశామన్న పాక్
Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..
Viral News: పాకిస్తాన్ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..
For National News And Telugu News