ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు..క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి నివాళులు

ABN, Publish Date - Aug 09 , 2025 | 11:07 AM

రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల ధైర్యాన్ని స్మరించుకుని నివాళులు అర్పించారు.

PM Modi Raksha Bandhan 2025

రక్షా బంధన్ పండుగ వచ్చేసింది. ఈ పండుగ అంటే సోదరుడు-సోదరి మధ్య ఉన్న ప్రేమ, బంధం గురించి గుర్తు చేసే అద్భుతమైన సమయం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు (PM Modi Raksha Bandhan 2025) తెలియజేశారు. సోషల్ మీడియా X వేదికగా ఆయన ఈ పండుగ సోదరీ-సోదరుల మధ్య ప్రేమను మరింత పెంచుతుందని గుర్తు చేశారు. రక్షా బంధన్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా మోదీ తెలిపారు.

అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్

అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సోదరీ-సోదరుల మధ్య ప్రేమ, నమ్మకం, రక్షణ వంటి అవినాభావ బంధాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. ఈ పండుగ మీ జీవితంలో ఆనందం, ఉత్సాహం నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ పండుగ సోదరీమణుల రక్షణ స్ఫూర్తిని మరింత బలపరుస్తుందని ఆయన ఆశించారు.

పవిత్రతకు చిహ్నం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు కూడా ఈ సందర్భంగా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ పండుగ రాఖీ దారం పవిత్రతకు చిహ్నం మాత్రమే కాదు, సోదరీమణుల గౌరవం, భద్రత, ఆనందం, శ్రేయస్సుకు నిబద్ధత కూడా అని గుర్తు చేశారు. ఈ పండుగ మనలో రక్షణ స్ఫూర్తిని బలపరచాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

పోరాటంలో పాల్గొన్న వారికి నివాళులు

ఇదే రోజున, మన దేశ చరిత్రలో మరో ముఖ్యమైన సంఘటన కూడా జరిగింది. అదే క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు. నేడు 83వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ ఉద్యమంలో పాల్గొన్న ధైర్యవంతులకు నివాళులు అర్పించారు. బాపు గారి స్ఫూర్తిదాయక నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరులందరినీ మనం కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని గుర్తు చేశారు. ఆ ఉద్యమం అనేక మంది ప్రజలను స్వేచ్ఛ కోసం ఏకం చేసిందని, మన స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. ఆ ధీరుల త్యాగం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 11:14 AM