ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Shooting: బిహార్‌లో షాకింగ్ ఘటన.. ఐసీయూలోని పేషెంట్‌పై కాల్పులు జరిపి హత్య

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:05 PM

బిహార్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్నాలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై ప్రత్యర్థి గ్యాంగ్‌ సభ్యులు తుపాకీలతో కాల్పులు జరిపి అంతమొందించారు. మృతుడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పెరోల్‌పై విడుదలైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా హత్యకు గురైనట్టు చెప్పారు.

Patna hospital shooting

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో గ్యాంగ్ వార్ కలకలం రేగింది. ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన కొందరు దారుణంగా హతమార్చారు. సినీ ఫక్కీలో తుపాకీలతో ఐసీయూలోకి వెళ్లి బాధితుడిపై కాల్పులు జరిగి అంతమొందించారు. పట్నాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి (Patna Hospital Shooting).

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు చందన్ మిశ్రా ఓ క్రిమినల్. బక్సర్ జిల్లాకు చెందిన అతడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల పెరోల్‌పై విడుదలైన అతడు పరాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా ఈ దారుణం జరిగింది. ‘ప్రత్యర్థి గ్యాంగ్ అతడిపై ఈ దారుణానికి తెగబడింది. చందన్ షేరూ గ్యాంగ్ ఈ హత్య చేసి ఉంటుందని భావిస్తున్నాము. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాము’ అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తికేయ శర్మ తెలిపారు.

ఇటీవల బిహార్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వ్యాపారి గోపాల్ ఖేమ్కా, బీజేపీ నేత సురేంద్ర కెవత్, లాయర్ జితేంద్ర మహాతో హత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో పట్నా ఆసుపత్రి హత్య తీవ్ర కలకలానికి దారి తీసింది.

రాష్ట్రంలో నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌లో ఎవరికీ భద్రత లేకుండా పోయిందని ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘ప్రభుత్వ మద్దతున్న క్రిమినల్స్ ఐసీయూలోకి చొరబడి పేషెంట్‌ను హత్య చేశారు. 2005కు పూర్వం ఇలాంటి ఘటనలను చూశామా?’ అని ప్రశ్నించారు.

ఈ దారుణానికి పాల్పడిన క్రిమినల్స్‌ను వదిలిపెట్టేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా భరోసా ఇచ్చారు. లోతైన దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.

ఇక రాష్ట్రంలో హింసాత్మక ఘటన నియంత్రణకు అనేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ మీడియాకు తెలిపారు. 2004కు పూర్వంతో పోలిస్తే ప్రస్తుతం నేరాల సంఖ్య తగ్గిందని తెలిపారు. తాజా ఘటనలో నిందితులు ఆసుపత్రిలోకి ప్రవేశించి ఐసీయూ వరకూ ఎలా వచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి జేపీ మంత్రి సౌదీ పర్యటన

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 05:24 PM