ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor Debate: తొలిరోజే రభస

ABN, Publish Date - Jul 22 , 2025 | 05:35 AM

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్‌ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై ..

Operation Sindoor Debate
  • పహల్గామ్‌ అంశంపై స్తంభించిన పార్లమెంటు

  • ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షం.. ఆపరేషన్‌ సిందూర్‌ పైనా చర్చకు పట్టు

  • పహల్గామ్‌ హంతకుల ఆచూకీ ఏదన్న ఖర్గే

  • వచ్చేవారం 16 గంటల చర్చకు ప్రభుత్వం ఓకే

  • వ్యూహంపై మంత్రులతో చర్చించిన ప్రధాని

  • జస్టిస్‌ వర్మ తొలగింపు.. 204 మంది ఎంపీల సంతకాలు.. అభిశంసన ప్రక్రియ ప్రారంభం

  • ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది: ప్రధాని మోదీ

  • సభలో నా నోరు నొక్కేస్తున్నారు: రాహుల్‌

న్యూఢిల్లీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పహల్గామ్‌ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్‌ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో అత్యంత కీలక ప్రశ్నలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సన్నద్దమవుతున్నాయి. సోమవారం తొలిరోజే ఈ అంశంపై ఉభయ సభల్లో గందరగోళం జరిగింది. లోక్‌సభ ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించలేక పోయింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని బహిష్కరించాయి. పహల్గామ్‌ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులను ఇంతవరకు ఎందుకు నిర్బంధించడం కానీ, నిర్మూలించడం కానీ చేయలేదని, యుద్ధాన్ని తానే నిలిపి వేయించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనలో ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించనున్నాయి. ఉభయ సభలు తొలి రోజు వాయిదా వేసిన వెంటనే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రిజిజు, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మల, వ్యవసాయ మంత్రి శివరాజ్‌లతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చను ఏ విధంగా నిర్వహించాలి? అన్న అంశంపైనే ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మోదీ ఈ వారం విదేశీ పర్యటనలో ఉన్నందువల్ల ఆపరేషన్‌ సిందూర్‌పై వచ్చే వారం 16 గంటల పాటు చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం ఉదయం వర్షాకాల సమావేశాలు మొదలయ్యేందుకు ముందు స్పీకర్‌ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు సమయాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, సభా కార్యకలాపాలను నిలిపేసి పహల్గామ్‌పై చర్చ జరపాలని కాంగ్రెస్‌ విప్‌ మాణిక్కం టాగోర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 267 నిబంధన కింద వెంటనే చర్చించాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపీ రణదీప్‌ సూర్జేవాలా నోటీసులు సమర్పించారు. పూర్తి స్థాయి చర్చకు అనుమతిస్తానని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ దంఖడ్‌ హామీ ఇచ్చారు.

అయితే, ఆపరేషన్‌ సిందూర్‌ సహా అనేక అంశాలపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్‌ చేశాయి. నినాదాలతో హోరెత్తించాయి. గందరగోళం మధ్యలో ఉభయ సభల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌పై మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డాల మధ్య వాగ్వాదం జరిగింది. పహల్గామ్‌ సంఘటనకు దారితీసిన ఇంటలిజెన్స్‌ వైఫల్యంపై, జవాబుదారీ లేకపోవడం, యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 24 సార్లు చేసిన ప్రకటనలపై చర్చ జరగాల్సిందేనని ఖర్గే డిమాండ్‌ చేశారు. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీడీఎస్‌, డిప్యూటీ ఆర్మీ చీఫ్‌, ఇతర అధికారుల ప్రకటనలపై కూడా చర్చ జరగాలని పట్టుబట్టారు. యుద్ధానికి సంబంధించిన వివరాలను సభలో చర్చించడం సరైంది కాదని జేపీ నడ్డా అన్నారు. చర్చల ద్వారానే సభను సాగించాలని, మనం అంతర్గతంగా పోట్లాడితే శత్రువుకు బలం చేకూర్చినట్లవుతుందని జగదీప్‌ దంఖడ్‌ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 05:35 AM